పాపం ఆ నిర్మాత.. అచ్చం ఆ స్టార్ హీరోలా ఉండడంతో కారు ఆపి మరీ?

ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.అందులో కొన్ని మంచి మంచి అనుభవాలు ఉంటే మరి కొన్ని చేదు అనుభవాలు కూడా ఉంటాయి.

 Suresh Babu About His Younger Days Looks Like Kamal Haasan-TeluguStop.com

ఇక నటీనటులకు మాత్రం తాము నటించిన ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక అనుభవం ఎదురవుతూనే ఉంటుంది.ఆ విషయాలను అభిమానులతో కూడా పంచుకుంటారు.

ఇదిలా ఉంటే ఓ నిర్మాతకు కూడా ఒక మంచి అనుభవం ఎదురైందట.అంతే కాకుండా తను అచ్చం ఓ స్టార్ హీరోల ఉండటంతో ఏకంగా తన కారు కూడా ఆపారట.

 Suresh Babu About His Younger Days Looks Like Kamal Haasan-పాపం ఆ నిర్మాత.. అచ్చం ఆ స్టార్ హీరోలా ఉండడంతో కారు ఆపి మరీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి కొన్ని కొన్ని సార్లు హీరో హీరోయిన్స్ లా చాలా మంది వ్యక్తులు కనిపిస్తుంటారు.నిజానికి అచ్చం హీరో హీరోయిన్స్ లా కనిపించడంతో వీళ్లు ఏంటి ఇక్కడ ఉన్నారు అని షాక్ అయ్యే పరిస్థితులు కూడా వస్తుంటాయి.

కానీ దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే మాత్రం మామూలు వ్యక్తులే.అలా ఇప్పటికి ఎంతో మందికి అచ్చం నటీనటులుగా ఉన్నవాళ్ళు బయట బాగా కనిపిస్తుంటారు.

ఇదిలా ఉంటే ఒక నిర్మాత కూడా ఓ స్టార్ హీరో లా ఉన్నాడట.ఇంతకీ ఆ నిర్మాత ఎవరో కాదు దగ్గుబాటి సురేష్ బాబు.మంచి ఇండస్ట్రీ పరిచయం ఉన్న కుటుంబం నుండి పరిచయమైన సురేష్ బాబు నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన సురేష్ ప్రొడక్షన్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు చేపట్టాడు.

ఆ సంస్థలో ఎన్నో సినిమాలను నిర్మించాడు.చాలా వరకు అందులో తన సోదరుడు దగ్గుబాటి వెంకటేష్ సినిమాలే ఉన్నాయి.

ఈయన తల్లిదండ్రులు దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి.ఈయన కూడా తెలుగు సినీ నటుడుగా, నిర్మాతగా కూడా చేశాడు.అంతేకాకుండా రాజకీయంగా కూడా ముందుండేవాడు.ఇక ఈయన కూడా ఎన్నో సినిమాలలో నటించాడు.నిర్మాతగా కూడా చేశాడు.ఇక ఈయన 2015లో చనిపోయిన సంగతి తెలిసిందే.

సురేష్ బాబు, వెంకటేష్ అనే ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

అందులో వెంకటేష్ గురించి అందరికీ తెలిసిందే.ఇక సురేష్ బాబు నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు తన గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

తను అమెరికాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇండియాకి వచ్చాక ఒక స్నేహితుడి సహాయంతో స్పార్టెక్ సిరామిక్స్ అనే కంపెనీని ప్రారంభించాడట.కానీ అది అంతగా డెవలప్ కాకపోవడంతో.

తన తండ్రి ఆఫీసులో కూర్చొని కథలు వినడం, వాటిని ఎలా జడ్జ్ చేయడం ప్రారంభించాడట.

అందులో తనకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా వివరించేవాడట.తను యంగ్ గా ఉన్న సమయంలో స్టార్ హీరో కమల్ హాసన్ లా ఉండేవాడట.అంతేకాకుండా కమల్ హాసన్ లాంటి కారు తనకు కూడా ఉండేదని.

దీంతో ప్రజలంతా తనను కమల్ హాసన్ అనుకొని కారును కూడా ఆపే వారని తెలిపాడు.ఇక తనను డైరెక్టర్ భారతీ రాజా ఓ సినిమా కోసం కూడా ఆఫర్ చేశాడట.

కానీ తనకు నటనపై ఆసక్తి లేనందుకు నో చెప్పాడట సురేష్ బాబు.

#Suresh Babu #Suresh Babu #Rana Daggubati #Suresh Babu #DaggubatiSuresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు