సురేందర్‌ రెడ్డి మరీ ఇంత పట్టుదలకు పోవడం కరెక్ట్‌ కాదు  

Surendhar Reddy Allu Arjun Akhil Mahesh Babu Allu Arjun And Surendar Reddy - Telugu Akhil, Allu Arjun, Allu Arjun And Surendha Reddy, Mahesh Babu, Most Eligible Bachelor, Saira Narasimha Reddy, Surendhar Reddy

సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత సురేందర్‌ రెడ్డి ఎవరితో ఏం సినిమా చేయబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది.ఆ సినిమా వచ్చి ఆరు నెలలు కాబోతున్నా కూడా ఇప్పటి వరకు కొత్త సినిమా విషయంలో సురేందర్‌ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు.

 Surendhar Reddy Allu Arjun Akhil Mahesh Babu Allu Arjun And Surendar Reddy

పైగా ఈయన కేవలం టాలీవుడ్‌ స్టార్‌ హీరోలను మాత్రమే కలుస్తున్నాడు.చిన్న హీరోలు ఈయనతో సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా నో అంటున్నాడు.

పైగా వచ్చిన ఆఫర్లు కూడా వదిలేస్తున్నాడట.

సురేందర్‌ రెడ్డి మరీ ఇంత పట్టుదలకు పోవడం కరెక్ట్‌ కాదు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ ఒక సినిమాను చేయాలనుకున్నాడట.మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే సురేందర్‌ రెడ్డికి డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లుగా అక్కినేని వర్గాల ద్వారా సురేందర్‌ రెడ్డికి మెసేజ్‌ అందింది.కాని సురేందర్‌ రెడ్డి మాత్రం బన్నీ లేదా మహేష్‌బాబుతో సినిమాను చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

మహేష్‌బాబుతో గతంలో ఈయన సినిమా చేశాడు.ఇప్పుడు మరోసారి ఆయన దర్శకత్వంలో చేసేందుకు ఆసక్తిగా లేడు.అయినా కూడా పదే పదే కథలు వినిపించడంతో పాటు ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇక రేసు గుర్రం వంటి మరో సినిమాను తీస్తానంటూ బన్నీ వద్దకు కూడా తిరుగుతున్నాడట.

కాని బన్నీ కూడా అస్సలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.అయినా కూడా చిన్న హీరోల కంటే పెద్ద హీరోలపైనే సురేందర్‌ రెడ్డి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాడు.

సురేందర్‌ రెడ్డి ఇలాగే పట్టుదలకు పోతే ఖచ్చితంగా కెరీర్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test