సైరా దెబ్బకు సైలెంట్ అయ్యాడు.. అసలు కారణం అదేనట!  

Surender Reddy Waiting For Allu Arjun After Mega Hero Rejected - Telugu Allu Arjun, Surender Reddy, Sye Raa Narasimha Reddy, Telugu Movie News

కిక్, రేసుగుర్రం, ధృవ వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డితో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.మెగాస్టార్ ప్రెస్టీజియస్ మూవీగా భావించిన ఈ సినిమాను అంతే ప్రెస్టీజియస్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు.

Surender Reddy Waiting For Allu Arjun After Mega Hero Rejected

అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టక పోవడంతో సురేందర్ రెడ్డిపై మెగా హీరోలు గుర్రుమంటున్నారు.

కాగా సురేందర్ రెడ్డి తన నెక్ట్స్ మూవీని ప్రభాస్‌తో తీయాలని చూశాడట.

కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల మరో రెండేళ్ల వరకు ఆగాల్సిందే అని చెప్పాడట.దీంతో వరుణ్ తేజ్‌తో తన నెక్ట్స్ మూవీని చేయాలని అనుకున్నాడట.కానీ రామ్ చరణ్‌తో సురేందర్ రెడ్డికి చెడటంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాకు నో అన్నాడట.సైరా చిత్రానికి సంబంధించి తనకు రెమ్యునరేషన్ బాకీ పడ్డారని రామ్ చరణ్‌పై సురేందర్ రెడ్డి డైరెక్టర్స్ అసోసియేషన్ మరియు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయడమే దీనికి కారణమట.

దీంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఎలాగైనా సినిమా చేయాలని సురేందర్ రెడ్డి ఫిక్స్ అయ్యాడట.కాగా బన్నీ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడట సురేందర్ రెడ్డి.

బన్నీ తనకు ఎప్పుడు ఓకే చెబితే అప్పుడు సినిమా చేసేందుకు రెడీ అవున్నాడు ఈ డైరెక్టర్.మరి ఆయన ఎదురుచూపులకు బన్నీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.

#Allu Arjun #Surender Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Surender Reddy Waiting For Allu Arjun After Mega Hero Rejected Related Telugu News,Photos/Pics,Images..