సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని యువ హీరో అఖిల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కనున్న సినిమా ఏజెంట్.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా తర్వాత అఖిల్ తో ఈ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతుంది.
రామ్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో రా ఏజెంట్ గా అఖిల్ మొదటి సారి కనిపించబోతున్నాడు.
యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాతో కచ్చితంగా కమర్షియల్ మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలనే కసితో అఖిల్ ఉన్నాడు.ఇక స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి అఖిల్ ని డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేశాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఇక మెజారిటీ షూటింగ్ ఫారిన్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఇప్పటి వరకు కెరియర్ లో హిట్ ముఖం చూడలేక సతమతం అవుతున్న అఖిల్ ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ముంబై మోడల్ అయిన సాక్షివైద్యని తీసుకున్నట్లు టాక్ వచ్చింది.
కాని ఆమె సినిమా ఓపెనింగ్ లో పాల్గొనలేదు.అలాగే చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా ప్రకటించలేదు.
దీని బట్టి ఆమె ఇంకా హీరోయిన్ గా కన్ఫర్మ్ కాలేదని ఇందులో బాలీవుడ్ లో హీరోయిన్స్ అయిన సారా ఆలీఖాన్, యంగ్ హీరోయిన్స్ లో ఒకరిని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.అలాగే రష్మిక డేట్స్ కోసం కూడా చూస్తున్నారని సమాచారం.
వీళ్ళు ఎవరూ సెట్ కాకుంటే ఫైనల్ గా సాక్షికి వెళ్ళే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ గా హీరోయిన్ గురించి ఎనౌన్స్ చేసే వరకు తెలిసే అవకాశం లేదు.