అఖిల్ కథకు మెరుగులు దిద్దుతున్న సురేందర్ రెడ్డి..!

టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు.ఈయన కు ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.

 Surender Reddy Reworking On Agent Script-TeluguStop.com

నటన, డాన్స్ లో అదరగొడుతున్న ఎందుకో అఖిల్ కు కలిసిరావడం లేదు.ఈయన ఎంచుకునే స్టోరీలు వల్లే సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.

అందుకే అఖిల్ కెరీర్ కు ఒక హిట్ సినిమా చాలా అవసరం.

 Surender Reddy Reworking On Agent Script-అఖిల్ కథకు మెరుగులు దిద్దుతున్న సురేందర్ రెడ్డి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అఖిల్ పూజ హెగ్డే మధ్య వచ్చే లవ్ సీన్స్ ఈ సినిమాకే హైలెట్ అని టాక్ వస్తుంది.

వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా అందంగా ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

జూన్ 19 న ఈ సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది కష్టమే.

అయితే అఖిల్ ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ”ఏజెంట్” సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.అఖిల్ లోని మాస్ హీరోను బయటకు తీసి ప్రేక్షకులకు కొత్తగా చూపించేందుకు సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే విడుదల అయినా పోస్టర్ లో అఖిల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సురేందర్ రెడ్డి ఈ సినిమా కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట.కొంతమంది రచయితలతో కలిసి ఈ స్టోరీకి తుది మెరుగులు దిద్దుతున్నారట.

ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.చూడాలి మరి అఖిల్ లోని మాస్ యాంగిల్ ను ఎలా ప్రెసెంట్ చేస్తాడో.

#SurenderReddy #Surender Reddy #Agent Script #Akhil Akkineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు