రామ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మారుస్తానంటోన్న డైరెక్టర్  

Surender Reddy Powerful Script For Ram, Ram Pothineni, Ismart Shankar, Surender Reddy, Tollywood News - Telugu Ismart Shankar, Ram Pothineni, Surender Reddy, Tollywood News

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో చిరు సత్తా ఏమిటో మరోసారి బాక్సాఫీస్‌కు చూపించాడు.

 Surender Reddy Powerful Script For Ram

కాగా ఈ సినిమాను డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా, ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు అంతకు మించిన కష్టాన్ని పడుతున్నాడు.

గతంలో తన నెక్ట్స్ మూవీని చరణ్‌తో తీస్తానని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

రామ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మారుస్తానంటోన్న డైరెక్టర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఎందుకో ఈ సినిమా పట్టాలెక్కకపోవడంతో, తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో సురేందర్ రెడ్డి పడ్డాడు.

కాగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గతేడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన తాజా చిత్రం ‘రెడ్‌’ను రెడీ చేస్తున్నాడు ఈ హీరో.

ఇక తన నెక్ట్స్ మూవీని సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రామ్.దీంతో సురేందర్ రెడ్డి రామ్‌కు అదిరిపోయే హిట్ అందించేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే స్క్రిప్టు పనులు ముగించేసుకున్న సురేందర్ రెడ్డి, త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో మిగతా నటీనటుల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఈ సినిమాను ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ చేసే దిశగా ఆయన రెడీ అవుతున్నాడు.

మరి రామ్ కోసం సురేందర్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.కాగా రామ్ నటించిన రెడ్ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

#Ram Pothineni #Surender Reddy #Ismart Shankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Surender Reddy Powerful Script For Ram Related Telugu News,Photos/Pics,Images..