అఖిల్ ని ఏజెంట్ గా మారుస్తున్న సురేందర్ రెడ్డి

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్న అక్కినేని అఖిల్ తన నెక్స్ట్ సినిమాకి సంబందించిన పనులు చక్కబెడుతున్నాడు.ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.

 Surender Reddy Plan Spy Thriller With Akhil-TeluguStop.com

ఇక వరుస హ్యాట్రిక్ ఫ్లాప్ లతో డీలా పడ్డ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో క్లాసిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సినిమా ఎలా అయినా హిట్ అవుతుందనే గట్టి నమ్మకంతో బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు అఖిల్ కూడా ఉన్నాడు.

పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తూ ఉండటం వలన సినిమాకి అదనంగా కలిసొచ్చే అంశం.ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డి సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

 Surender Reddy Plan Spy Thriller With Akhil-అఖిల్ ని ఏజెంట్ గా మారుస్తున్న సురేందర్ రెడ్డి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీని సురేందర్ హీరోయిన్ గా తీసుకొస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే మరో వైపు ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తుంది.

సురేందర్ రెడ్డి అంటే స్టైలిష్ యాక్షన్ చిత్రాలకి ఐకాన్ లాంటివాడు.

ఇప్పుడు అఖిల్ కోసం కూడా అలాంటి కథనే ఈ దర్శకుడు సిద్ధం చేశాడని తెలుస్తుంది.సినిమాలో అఖిల్ ని ఓ సీక్రెట్ ఏజెంట్ గా సురేందర్ చూపించబోతున్నాడని టాక్ నడుస్తుంది.

అలాగే సినిమాకి కూడా ఏజెంట్ అనే టైటిల్ ని పెడుతున్నట్లు తెలుస్తుంది.స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ గా ఈ సినిమా ఉండబోతుందని బోగట్టా.

ఇలాంటి కథలకి యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ప్రెజెంటేషన్ చాలా ముఖ్యం.ఆ విషయంలో సురేందర్ రెడ్డి ఎలాగూ కూడా మంచి విషయం ఉన్న వ్యక్తి కావడంతో అఖిల్ కి సురేందర్ రెడ్డి సాలిడ్ హిట్ ఇవ్వడం పక్కా అనే మాట వినిపిస్తుంది.

#Surender Reddy #MostEligible #Spy Thriller #Akhil #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు