సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.కాగా తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Surender Reddy Penning Script For Allu Arjun, Surender Reddy, Allu Arjun, Sye Ra-TeluguStop.com

ఇక ఈ డైరెక్టర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను బన్నీతో ఓకే చేయించేందుకు సురేందర్ రెడ్డి ముందుగా చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడట.

అయితే వారెవ్వరూ కూడా సురేందర్ రెడ్డికి సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో, ఆయన తన నెక్ట్స్ చిత్రాన్ని బన్నీతో చేసేందుకు రెడీ అయ్యాడు.గతంలో రేసుగుర్రం లాంటి సెన్సేషనల్ హిట్ అందించిన సురేందర్ రెడ్డితో సినిమాకు బన్నీ కూడా ఓకే అన్నాడట.

దీంతో ప్రస్తుతం బన్నీ కోసం ఓ అల్ట్రా స్టైలిష్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడట ఈ డైరెక్టర్.మెగాస్టార్‌కు సైరా వంటి పీరియాడికల్ హిట్ అందించిన సురేందర్ రెడ్డి, ఇప్పుడు బన్నీ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక బన్నీ కూడా ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమాతో నాన్-బాహుబలి రికార్డును క్రియేట్ చేయగా, ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.

ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.మరి బన్నీ తన నెక్ట్స్ మూవీలో ఎలా కనిపిస్తాడా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube