రామ్ చరణ్ గ్రేట్ అంటూ ఆ విషయాలను బయటపెట్టిన సురేందర్ రెడ్డి!

మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ గురించి డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు.

 Surender Reddy Interesting Comments On Ram Charan Details,  Surender Reddy, Ram-TeluguStop.com

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ధ్రువ సినిమాలో నటించారు.అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి దర్శకత్వం వహించగా నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించారు.

ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశం గురించి తెలిపారు.ఈ చిత్రంలో ఓ సన్నివేశాన్ని తెరకెక్కించడం కోసం చిత్రబృందం మొత్తం బల్గేరియాకి వెళ్లామని తెలిపారు.

సాధారణంగా ఒక సినిమా షూటింగ్ చేయాలంటే షూటింగ్ కోసం సెట్ చేస్తారు కానీ ఇక్కడ చిత్రబృందం కోసం భారీ సెట్ వేశారని ఆయన తెలిపారు.

ఎడారిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో విపరీతమైన గాలి రావడం వల్ల షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది.

Telugu Dhruva, Surender Reddy, Ram Charan, Rooms, Tollywood-Movie

ఈ క్రమంలో ఎంతో మంది ఆర్టిస్టులు ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో రామ్ చరణ్ ఆర్టిస్టులకు ప్రయోజనకరంగా ఉండేలా రూమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.ఇలా ఆర్టిస్టు కోసం రూమ్స్ ఏర్పాటు చేయడం కోసం రామ్ చరణ్ భారీ మొత్తంలో ఖర్చు చేశారు.అలాగే గుర్రాల కోసం ప్రత్యేకంగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి షెడ్ వేయించారని, రామ్ చరణ్ స్థానంలో మరొక హీరో ఉంటే అది సాధ్యమయ్యే పని కాదని ఎంతైనా రామ్ చరణ్ గ్రేట్ అంటూ సురేందర్ రెడ్డి అతనిపై ప్రశంసలు కురిపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube