తారక్‌తో తప్పలేదన్న డైరెక్టర్.. ఏసుకుంటున్న ఫ్యాన్స్  

Surender Reddy Controversial Comments On Ntr-controversial Comments,ntr,surender Reddy,telugu Movies

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ప్రతి దర్శకుడు ఆసక్తి చూపిస్తుంటాడు.కానీ తారక్‌తో సినిమా చేయడం తనకు తప్పలేదని ఓ స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నాయి.దీంతో నందమూరి ఫ్యాన్స్ సురేందర్ రెడ్డిని ఏకిపారేస్తున్నారు.ఇంతకీ సురేందర్ రెడ్డి అంతలా కామెంట్స్ ఏం చేశాడని అనుకుంటున్నారా?గతంలో ఎన్టీఆర్‌తో కలిసి సురేందర్ రెడ్డి అశోక్ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు సురేందర్ రెడ్డి అసలు ఆసక్తి చూపించలేదట.

Surender Reddy Controversial Comments On Ntr-controversial Comments,ntr,surender Reddy,telugu Movies Telugu Tollywood Movie Cinema Film Latest News-Surender Reddy Controversial Comments On NTR-Controversial Ntr Surender Telugu Movies

కానీ తారక్ మేనేజర్‌ తనను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసినట్లు సురేందర్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.అంతేగాక తారక్‌తో సినిమా చేయకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు రావంటూ తారక్ మేనేజర్ బెదిరించినట్లు సురేందర్ రెడ్డి పేర్కొన్నాడు.దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.తారక్ ఇలాంటి పనులు చేయడంటూ నందమూరి ఫ్యాన్స్ సురేందర్ రెడ్డిని ఇష్టమొచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు.

కాగా తారక్ క్యారెక్టర్ అలాంటిది కాదని, ఆయనను అనవసరంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.