అఖిల్ తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసిన సైరా దర్శకుడు  

Surendar Reddy Next Movie With Akhil - Telugu Akhil, Bollywood, Pan India Movie, Surendar Reddy Next Movie, Tollywood

సైరా సినిమాతో టాలీవుడ్ లో పాన్ ఇండియా దర్శకుడుగా సత్తా చాటిన సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ సినిమాకి చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు.నెక్స్ట్ సినిమాని మెగా ఫ్యామిలీ హీరోలతోనే తీయాలని భావించిన అతనికి ఇప్పట్లో ఎవరి డేట్స్ దొరకలేదు.

Surendar Reddy Next Movie With Akhil - Telugu Akhil, Bollywood, Pan India Movie, Surendar Reddy Next Movie, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

దీంతో ప్రత్యామ్నాయంగా అక్కినేని కాంపౌండ్ లోకి అడుగు పెట్టాడు.అక్కడ అక్కినేని నట వారసుడు అఖిల్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

దీనికి ఇప్పటికే రంగం సిద్ధమైంది.

ప్రస్తుతం ఫ్లాప్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.సురేందర్ రెడ్డి అఖిల్ కి కథ చెప్పి ఒకే చేయించుకున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్పించానికి ముందుకి వచ్చినట్లు సమాచారం.

త్వరలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకునే అవకాశం ఉందని సమాచారం ఇక ఈ సినిమాని సురేందర్ రెడ్డి పాన్ ఇండియా మూవీగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

తాజా వార్తలు

Surendar Reddy Next Movie With Akhil-bollywood,pan India Movie,surendar Reddy Next Movie,tollywood Related....