అఖిల్, సురేందర్ రెడ్డి సినిమా లైన్ లోకి వచ్చింది... ఫస్ట్ లుక్ రెడీ

అక్కినేని నాగార్జున నట వారసుడుగా టాలీవుడ్ లోకి అఖిల్ సినిమాతో అడుగుపెట్టిన యువ హీరో ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అఖిల్ అక్ఖినేని హీరోగా ఎంట్రీకి ముందు ఈ పేరు భాగా పాపులర్ అయ్యింది.

 Surendar Reddy Akhil Movie First Look Launch-TeluguStop.com

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగా రాణిస్తూ అందరి దృష్టిలో పడటంతో పాటు అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో అయ్యే సత్తా ఉన్న వ్యక్తిగా అఖిల్ ని అక్కినేని ఫ్యాన్స్ భావించారు.అయితే అఖిల్ దురదృష్టం కొద్ది అతను చేసిన మొదటి మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

మొదటి సినిమాని పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తో తీస్తే భారీ డిజాస్టర్ అయ్యింది.వయస్సు మించి కథని అఖిల్ తన పెర్ఫార్మెన్స్ తో హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శలు వచ్చాయి.

 Surendar Reddy Akhil Movie First Look Launch-అఖిల్, సురేందర్ రెడ్డి సినిమా లైన్ లోకి వచ్చింది… ఫస్ట్ లుక్ రెడీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తరువాత హలో సినిమాలో లవ్ స్టొరీ చేసిన అది కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.ఇక మూడో సినిమా కోసం ఏకంగా మజ్ఞూలా మారిపోయి మిస్టర్ మజ్ఞూ అంటూ వచ్చాడు.

ఈ సినిమాలో యాక్షన్ కి స్పేస్ లేకపోయినా రొటీన్ స్టొరీ అని ప్రేక్షకులు తిప్పి కొట్టారు.

అయితే ఈ సారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అంటూ యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కోడతాననే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు.ఇక ఈ సినిమాలో లక్కీ చార్మ్ పూజా హెగ్డే హీరోయిన్ గా చేయడం కూడా సినిమాకి కలిసొస్తుందని భావిస్తున్నారు.

గీతా ఆర్ట్స్2లో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.ఇదిలా ఉంటే అఖిల్ నెక్స్ట్ సినిమాని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో, స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథాంశం ఉండబోతుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకొని వేల్లబోతున్నారు.

అయితే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు లాంచ్ చేయబోతున్నారు.దాంతో పాటే టైటిల్ కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని బోగట్టా.

#MostEligible #Surendar Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు