కూతురుని హీరోయిన్ గా చేసే పనిలో బిజీగా ఉన్న సురేఖావాణి

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి.క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖావాణి తనకంటూ మార్క్ ని క్రియేట్ చేసుకుంది.

ఈమె ఈ మధ్యకాలంలో తన కూతురు సుప్రీతని అందరికి పరిచయం చేయడానికి సోషల్ మీడియాలో ఉపయోగించుకుంటుంది.టిక్ టాక్, యుట్యూబ్ లలో తరుచుగా సురేఖావాణి కూతురుతో కలిసి డాన్స్ లు చేస్తూ సందడి చేస్తుంది.

Surekhavani Plan To Introduced Her Daughter As A Heroine, Tollywood, Telugu Cine

అయితే ఈ వీడియోల ముఖ్య ఉద్దేశ్యం తన కూతురు టాలెంట్ ని అందరికి పరిచయం చేయడమే అనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.కూతురుని హీరోయిన్ గా చూడాలని తన భర్త కోరికని తీర్చడానికి సురేఖావాణి తన పరిచయాలని భాగా ఉపయోగిస్తున్నట్లు టాక్.

టాలీవుడ్ లో నార్త్ గర్ల్స్ కి ఇచ్చే ప్రాధాన్యత తెలుగు అమ్మాయిలకి ఉండదు.ఈ నేపధ్యంలో చాలా మంది టాలెంటెడ్ తెలుగు హీరోయిన్స్ సింగిల్ డిజిట్ సినిమాలు చేసి ఈ మధ్యకాలంలో కనుమరుగు అవుతున్నారు.

Advertisement

మెగా ఫ్యామిలీ అండ ఉన్న నిహారికా హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేకపోయింది.రాజశేఖర్ కూతుళ్ళు హీరోయిన్స్ గా ప్రయత్నం చేస్తున్న కూడా వారికి అంతంత మాత్రంగానే అదృష్టం ఉంది.

మరి ఇలాంటి సమయంలో సురేఖావాణి తన కూతురుని ఎలా హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలబెట్టగలుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అయితే సినిమాలు కాకపోయినా సీరియల్స్ అయిన లీడ్ హీరోయిన్ గా సురేఖావాణి తన కూతురుని నిలబెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు