కూతురితో స్టెప్పులేసి పిచ్చెక్కిస్తున్న సురేఖా వాణి.. వైరల్ వీడియో!

టాలీవుడ్ ఇండస్ట్రీ ఆర్టిస్టు సురేఖ వాణి.తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే.

 Surekha Vani Viral Video Of Her Stepdaughter Going Crazy With Her Daughter, Sure-TeluguStop.com

ఈమధ్య సోషల్ మీడియా ట్రోలింగ్స్ తో మరింత దగ్గరగా పరిచయమైంది.ఎన్నో సినిమాలలో వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రలలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా యాంకర్ గా కూడా పని చేసింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఈమధ్య సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటున్న సురేఖ వాణి.తన భర్త మరణించిన తర్వాత ఎన్నో రకాల పుకార్లు ఎదుర్కొంది.రెండో పెళ్లి చేసుకుంటుందని బాగా పుకార్లు వచ్చాయి.ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఇది కేవలం వైరల్ చేయడానికి మాత్రమే కొందరు ఇష్యూ క్రియేట్ చేస్తుంటారని తెలిపింది.

ఇక తనకు సుప్రీత అనే కూతురు కూడా ఉంది.తనని కూడా తన తల్లి రెండో పెళ్లి విషయం గురించి తానే పెళ్లి చేసుకోమని చెప్పిందని పుకార్లు కూడా వచ్చాయి.

ఇక తన కూతురుతో కలిసి సురేఖ వాణి తరచుగా పార్టీలతో బాగా బిజీగా ఉంటుంది.అంతేకాకుండా ఈమధ్య సురేఖవాణి పొట్టి పొట్టి బట్టలతో కూడా హీరోయిన్ లా తయారవుతుంది.

తన అందాలతో అందర్నీ పిచ్చెక్కిస్తుంది సురేఖ వాణి.అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.అందులో తల్లి తన కూతురు ఓ పాటకు డాన్స్ చేస్తున్నారు.

సురేఖ వాణి ఆకుపచ్చ చీరను, తన కూతురు ఎర్ర చీర ను కట్టుకొని స్టెప్పులేసి తెగ పిచ్చెక్కిస్తున్నారు.ఇది చూస్తే నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube