ఎవరు ఏమైనా అనుకోండి.. మేము ఎప్పటికీ స్నేహితులమే: సుప్రీత

టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

 Surekha Vani Daughter Supritha About Her Boyfriend, Surekha Vani, Supritha, Boyfriend, Tollywood-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో సురేఖ వాణి సినిమాలో పెద్దగా కనిపించడం లేదు.ఇకపోతే సురేఖ వాణి కూతురు సుప్రీత మనందరికీ సుపరిచితమే.

సురేఖ, సుప్రీత ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.అంతేకాకుండా వీరిద్దరూ కలసి టిక్ టాక్ వీడియో ద్వారా డ్యాన్సులు చేస్తూ బాగా ఫేమస్ కూడా అయ్యారు.

 Surekha Vani Daughter Supritha About Her Boyfriend, Surekha Vani, Supritha, Boyfriend, Tollywood-ఎవరు ఏమైనా అనుకోండి.. మేము ఎప్పటికీ స్నేహితులమే: సుప్రీత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికీ వీరిద్దరూ డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా నిలుస్తూ ఉంటారు.సురేఖ వాణి అయితే తన కూతురులాగే హాట్ హాట్ గా డ్రెస్సులు వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ హాట్ ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది.

ఇక వారి పై వచ్చే ట్రోలింగ్స్ కీ తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.ఇక మితిమీరి ట్రోలింగ్ చేసేవారికి తల్లీ కూతుళ్లు ఇద్దరూ గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటారు.

ఎప్పటిలాగే సుప్రీత తాజాగా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టుకుంది.ఈ క్రమంలోనే వారు అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం చెబుతూ వచ్చింది.

సుప్రీత ఫ్రెండ్స్ గ్యాంగ్ గురించి మనందరికీ తెలిసిందే.

Telugu Boyfriend, Supritha, Surekha Vani, Tollywood-Movie

సుప్రీత ఫ్రెండ్స్ గ్యాంగ్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీకు నందు ఏమవుతాడు బాయ్ ఫ్రెండా.? లేకుంటే బాయ్ బెష్టినా అని ప్రశ్నించగా.ఆ విషయం పై స్పందించిన సుప్రీతః తనదైన శైలిలో స్పందించింది.అవును ప్రతి అమ్మాయికి అలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి.ఒక అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ గా ఉండలేరు అని అందరూ అంటారు.కానీ మేము ఫ్రెండ్స్ లానే ఉన్నాం ఎవరు ఏమనుకున్నా సరే.మేము ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సుప్రీత చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube