భర్త మృతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి

ఈమద్య కాలంలో సీనియర్ నటి సురేఖ వాణి సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా కూతురు తో కలిసి వీడియో లు చేస్తూ ఫొటోలు షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది.భర్త మృతి చెందిన తర్వాత మరీ ఇంతగా ఇలాంటి వీడియో లు చేయడం ఏంటీ అంటూ కొందరు విమర్శ లు చేస్తున్నారు.

 Surekha Vani About Her Husband In Ali Interview-TeluguStop.com

సురేఖ భర్త మృతి గురించి పలు విమర్శలు కూడా ఉన్నాయి.ఈ సమయంలో ఒక ఇంటర్వ్యూ లో సురేఖ పుకార్లకు క్లారిటీ ఇచ్చింది.

తన భర్త ను కాపాడుకునేందుకు ఎంతగా కష్టపడ్డానో నాకు తెలుసు.మీడియాలో వస్తున్న వార్తలు మరియు తన భర్త కుటుంబ సభ్యుల గురించి సురేఖ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Surekha Vani About Her Husband In Ali Interview-భర్త మృతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సురేఖ వాణి మాట్లాడుతూ… మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము.ఇద్దరం కూడా చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఆయన అనారోగ్య సమస్యలు మా సంతోషంను దూరం చేశాయి.

పదేళ్లుగా ఆయన షుగర్‌ వ్యాధితో బాధ పడుతున్నారు.ఆ కారణంగా పలు సార్లు శరీరంలో రక్తం గడ్డ కట్టడం వంటివి జరిగింది.

ఆయన ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాం.మాకు ఆయన కుటుంబం నుండి ఎలాంటి మద్దతు దక్కలేదు.

వేళ్లలో రక్త గడ్డ కట్టడంతో షుగర్ కారణం గా వేళ్ల ను తొలగించాల్సి వచ్చింది.ఆ తర్వాత నెల రోజు లకే ఆయన చనిపోయారు.

ఆయన ఆసుపత్రి లో ఉన్న సమయంలో మేము పడ్డ ఇబ్బందు లు ఎవరు పట్టించుకోలేదు.మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

అయినా కూడా మాకు మేము జీవితాన్ని గడుపుతున్నాము.అయినా కూడా ఈ సమయంలో కొందరు మమ్ములను టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నట్లుగా ఎమోషనల్‌ అయ్యింది.

తన భర్త మృతి ని కొందరు వివాదాస్పదం చేయడం దారుణం అంటూ కన్నీరు పెట్టుకుంది.

#SurekhaVani #SurekhaVani #Ali Talk Show #Surekha Vani #FilmNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు