కాంగ్రెస్ అధిష్టాన‌మే అడుగుతోందంటున్న సురేఖ‌.. అందుకోస‌మే హామీ కోరింద‌ట‌

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు ఎంత సీరియ‌స్ గా సాగుతున్నాయో అంద‌రికీ విదిత‌మే.ఈ విష‌యంలో టీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీ ప్ర‌చారాలు చేస్తూ మిగ‌తా పార్టీల కంటూ కూడా ఓ అడుగు ముందే ఉన్నాయ‌ని చెప్పొచ్చు.

 Surekha Is Asking For The Supremacy Of The Congress. That Is Why He Has Asked Fo-TeluguStop.com

కాగా ఇందులో మ‌రీ ముఖ్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓ అడుగు ముందున్నారు.ఇక టీఆర్ ఎస్ కూడా త‌మ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి దీటుగా ప్రచారం నిర్వహిస్తోంది.

ఇక అటు బీజేపీ నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన ఈట‌ల బ‌రిలోకి దిగుతుండ‌గా.ఇటు టీఆర్ ఎస్ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని బరిలో నిలిపింది.

దీంతో ఇరు పార్టీలు బీసీల‌ను బ‌రిలోకి దించ‌డంతో కాంగ్రెస్ బ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది.ఇక కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ ను వీడ‌టంతో ఆ పార్టీకి అస‌లు క్యాండిడేట్ దొర‌క్క‌నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇంకా చెప్పాలంటే అస‌లు పార్టీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు కూడా ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో అంతా ఇబ్బంది ప‌డుతున్నారు.ఈ కార‌ణంగానే నేటికీ అభ్యర్థిని కూడా ప్రకటించకుండా క‌నీసం రేస్‌లో లేకుండా పోయింది కాంగ్రెస్‌.

అయితే మాజీ మంత్రి కొండా సురేఖ పేరు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఆమె దీనిపై స్పందించారు.

Telugu Congress, Huzurabad, Koshik Reddy, Rahul Gandhi, Rewnth Reddy, Surekha, T

ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఆమె క‌నీసం నోరువిప్పలేదు.కానీ రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ హుజూరాబాద్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల‌ని కొంద‌రు కాంగ్రెస్ సీనియర్ నేతలు త‌న‌ను ఇప్ప‌టికే అడుగుతున్నారని క్లారిటీ ఇచ్చేసింది.ఈ కార‌ణంగానే త‌న పేరు తెర‌మీద‌కు వ‌చ్చింద‌ని, అయితే భ‌విష్య‌త్ లో జ‌రిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారి ద‌గ్గ‌రి నుంచి కొన్ని ప్ర‌ధాన హామీల‌ను తాను కోరినట్లు కూడా తెలిపింది.

అయితే తాను హుజూరాబాద్ బరిలో క‌చ్చితంగా నిలుస్తుందా లేదా అన్న‌దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.ఇక కాంగ్రెస్ పార్టీ ఆమె కండీష‌న్‌కు ఒప్పుకుంటే మాత్రం ఆమెనే పోటీ చేసే అవ‌కాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube