బర్త్ డే వేడుకల్లో కేక్ ముఖానికి పూసినా,ఫోమ్ స్ప్రే చేసినా జైలుకు వెళ్లాల్సిందే!  

Surat Police Ban On Birthday Celebrations-foam Spray,general Telugu Updates,jail,జైలు

బర్త్ డే సెలబ్రేషన్స్ అనగానే చిన్నా, పెద్దా అందరూ సిద్ధమౌతారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి దానిని పుట్టిన రోజు జరుపుకొనే వ్యక్తి ముఖానికి కూడా పూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక అలాంటి ఎంజాయ్ మెంట్స్ కు ఫుల్ స్టాప్ పడినట్లే..

బర్త్ డే వేడుకల్లో కేక్ ముఖానికి పూసినా,ఫోమ్ స్ప్రే చేసినా జైలుకు వెళ్లాల్సిందే!-Surat Police Ban On Birthday Celebrations

ఆలా ముఖానికి కేక్ పూసినా, ఫోమ్ స్ప్రే చేసినా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. ఎక్కడో కాదండి గుజరాత్ లోనే. గుజరాత్లోని సూరత్ పట్టణ పోలిస్ కమీషనర్ ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

దీనితో ఇక పై సూరత్ లో నిర్వహించే బర్త్ డే వేడుకల్లో ఈ విధంగా గనుక కేక్ ముఖానికి పూసినా,ఫోమ్ స్ప్రే చేసినా జైలుకు వెళ్లాల్సిందేనని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

అయితే గుజరాత్ పోలీసులు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఇటీవల సూరత్ లోని ఇమాస్ రోడ్డు లో కొంతమంది ఒక బర్త్ డే వేడుక ను ఘనంగా నిర్వహించారు.

అయితే ఈ వేడుకల్లో భాగంగా కోడిగుడ్లు విరసరడం వంటి విపరీత చర్యలకు పాల్పడడం తో పలువురు రోడ్డు పై పడిపోయి గాయాలపాలయ్యారు. దీంతో పోలీసులు ఆ వేడుకల్లో పాల్గొన్న కొంతమంది పై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అందుకే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదు అన్న ఉద్దేశ్యం తో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.