గ్యాంగ్ స్టార్స్ మధ్య లవ్ స్టోరీ... పోలీస్ స్టేషన్ లో పంచాయితీ

గ్యాంగ్ స్టార్ లవ్ స్టొరీలు ఎక్కువగా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం.అయితే గ్యాంగ్ స్టార్స్ మధ్య ముక్కోణపు ప్రేమ కథలతో ఇప్పటి వరకు సినిమాలు రాకపోయినా కూడా అలాంటి తరహా కథ వస్తే మాత్రం కచ్చితంగా కాస్తా ఆసక్తికరంగా ఉంటుంది.

 Triangle Love Story Reaches Police Station, Surat, Gangster Love Story, Lady Don-TeluguStop.com

అలాంటి ముక్కోణపు ప్రేమ కథ ముగ్గురు గ్యాంగ్ స్టార్స్ మధ్య నిజంగానే జరిగింది.అందులో ఒకరు అమ్మాయి కాగా మిగిలిన ఇద్దరు అబ్బాయిలు.

లేడీ డాన్ ప్రేమ కోసం ఇద్దరు గ్యాంగ్ స్టార్ లు గొడవపడ్డారు.చివరికి ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం విశేషం.22 ఏళ్ల భూరి అలియాస్ అస్మితాబా గోహిల్ ఓ లేడీ డాన్.సూరత్ లోని వరాచా ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ క్రిమినల్ గా ఉంది

కొన్నాళ్ల కిందటి దాకా సంజయ్ బాఘేలా అనే గ్యాంగ్ స్టర్ తో ఆమె సన్నిహితంగా మెలిగింది.

అయితే కొన్నిరోజులుగా తన గ్యాంగ్ లోని రాహుల్ అనే గ్యాంగ్ స్టర్ తో స్నేహంగా మెలగడం ప్రారంభించింది.తనను అస్మితాబా పట్టించుకోకుండా, మరో యువకుడితో చనువుగా ఉండడాన్ని భరించలేని సంజయ్ బాఘేలా ప్రియురాలు అని కూడా చూడకుండా అస్మితాబాపై దాడి చేశాడు.

తనని తప్ప మరొకరిని చూస్తే చంపేస్తా అంటూ బెదిరించాడు.అయినా కూడా ఆమె రాహుల్ తోనే ఉండటంతో బఘేలా ఆమె దగ్గరకికి వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడు.

అతని బాధని భరించలేని అస్మితాబా పోలీసులని ఆశ్రయించింది.వారు ఆమెని కాపాడటానికి రాగా భాఘేలా తప్పించుకునే ప్రయత్నం చేసి కాలు విరగ్గొట్టుకున్నాడు.

ఇప్పుడు వీరి ముగ్గురు పంచాయితీ పోలీస్ స్టేషన్ కి చేరింది.మరి పోలీసులు వారి కథకి ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube