నయనతారతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ హారర్ చిత్రం!

తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా భాసిల్లుతున్న నయనతార ప్రధాన తారగా ఓ హారర్ చిత్రం రూపొందనుంది.తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మురగదాసు రామస్వామి దర్శకుడు.తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ నయనతార నటించనున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రమిది.మయూరి తర్వాత ఆమె నటిస్తున్న మరో హారర్ చిత్రమిది.

 Suraksha Entertainments Horror Movie With Nayanthara-TeluguStop.com

ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో నయనతార పాత్ర ఆసక్తికరంగా వుంటుంది.ఉత్కంఠను కలిగించే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం అందరిలోనూ ఉత్సుకతను కలిగిస్తుంది.

ఈ నెల 18 నుంచి చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది.మా సంస్థలో విభిన్నమైన సినిమాలను రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube