పెళ్లి చేసుకొని, ప్రెగ్నెంట్ అవ్వడాన్ని గోల్ అంటున్న సుప్రిత.. వైరల్ స్టోరీ!

టాలీవుడ్ కు చెందిన నటి సురేఖ వాణి గురించి అందరికీ పరిచయమే.క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

 Supritha Sayes Get Married And Getes Pregnant Is A Goalss Post Goes Viral Story,-TeluguStop.com

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది.ఇక సురేఖ వాణి ప్రస్తుతం మాత్రం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

గత కొంత కాలం నుండి సురేఖ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.తన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఇక ఈమె ఇంత యాక్టివ్ గా కావడానికి కారణం తన కూతురు సుప్రీత అనే చెప్పాలి.తనెత్తు కూతురు గా ఉన్న సుప్రీతకు సరిగ్గా ఇండస్ట్రీ పరిచయం కూడా లేదు.

కానీ తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.

ఈమె కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.

ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.

పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.

Telugu Alia Bhatt, Goalss, Pregnant, Supritha, Tollywood-Movie

అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.

ఇక సుప్రీత కూడా వెండితెరపై అడుగుపెట్టింది.‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో కూడా సుప్రీత సోషల్ మీడియా వేదికగా ఫన్నీ వీడియో షేర్ చేసుకుంది.ఇండస్ట్రీకి చెందిన వెండితెర సెలబ్రెటీలకు కూడా పలు విషయాలలో శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటుంది.

Telugu Alia Bhatt, Goalss, Pregnant, Supritha, Tollywood-Movie

ఇక తాజాగా మరో బాలీవుడ్ క్యూట్ కపుల్ ఫోటో పంచుకుంటూ ఇదే గోల్ అని తెలిపింది.ఇంతకు ఆ కపుల్ ఎవరో కాదు ఆలియా భట్, రణబీర్ కపూర్.ఇక వీరు ఈ ఏడాది పెళ్లి చేసుకోగా తాజాగా తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఇక అదే ఫోటోను సుప్రీత షేర్ చేసుకుంటూ పెళ్లి చేసుకోవడానికి ప్రెగ్నెంట్ కావడానికి ఇదే గోల్ అన్నట్లు పంచుకుంది.

ఇక ఆమె పంచుకున్న స్టోరీ వైరల్ గా మారింది.ఇక సుప్రీత లేచింది మహిళా లోకం సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube