రాజీనామాల పై వారం పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదు అన్న సుప్రీం కోర్టు  

Supreme Court Key Order To Assembly Speaker-

కర్ణాటకలో రాజకీయం రోజు రోజుకొక కీలక మలుపు తిరుగుతుంది.నిన్న సుప్రీం కోర్టు సైతం కలుగజేసుకొని సాయంత్రం లోపు స్పీకర్ ఎదుట హాజరు కావాలని అల్టిమేటం జారీ చేయడం తో కర్ణాటక రాజకీయం ఒక కొలిక్కి వస్తుంది అని భావించారు.ఈ క్రమంలో అసంతృప్తి ఎమ్మెల్యేలు అందరూ కూడా హుటాహుటిన ముంబై నుంచి ప్రత్యేక విమానం లో బయలుదేరి స్పీకర్ ను కలిశారు.

Supreme Court Key Order To Assembly Speaker--Supreme Court Key Order To Assembly Speaker-

అయితే స్పీకర్ రమేష్ కుమార్ మాత్రం తనకు రాజీనామాలు సమర్పించిన వారిలో 8 మంది రాజీనామా లు నిర్దేశిత ఫార్మాట్ లో లేవని, ఆ లేఖలను అధ్యయనం చేసి ఆ ఎమ్మెల్యేల తో కలిసి మాట్లాడి వారు మనస్పూర్తి గా రాజీనామా చేశారా లేదా అన్న విషయం తెలుసుకోవాల్సి ఉందని అప్పటివరకు వారి రాజీనామాలు ఆమోదించను అంటూ తెలిపారు.

Supreme Court Key Order To Assembly Speaker--Supreme Court Key Order To Assembly Speaker-

అయితే ఈ అంశం మరోసారి కోర్టు ముంగిట రావడం తో కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాపై వారం రోజుల పాటు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది.వారి రాజీనామాలు ఆమోదించడం కానీ, వారిపై అనర్హత వేటు వేయడం కానీ చేయకూడదు అంటూ కోర్టు స్పష్టం చేసింది.అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేసినట్లు తెలుస్తుంది.