'సుప్రీమ్' రివ్యూ

మెగా హీరోలలో అల్లూ అర్జున్ తరవాత మంచి జోరు మీద ఉన్నాడు సాయి ధరం తేజ.సాయి మొదటి సినిమా రేయ్ అయినా కూడా తరవాత తరవాత మంచి సినిమాలు పడ్డాయి.

 Supreme Movie Review-TeluguStop.com

పిల్లా నువ్వు లేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా సూపర్ ఫారం కొనసాగిస్తున్నాడు మనోడు.పటాస్ తో కళ్యాణ్ రాం కి కెరీర్ లోనే అతిపెద్ద హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒచ్చిన సుప్రీం సినిమా ఎలా ఉందొ చూద్దాం రండి.

కథ:

అనంతపూర్‌లో తరాలుగా జాగృతి ట్రస్ట్ సంస్థ పరిధిలోని వందల ఎకరాలను నమ్ముకొని వేలమంది జీవనం సాగిస్తూ ఉంటారు.ఆ ట్రస్ట్ పరిధిలోని భూములను తన సొంతం చేసుకునేందుకు విక్రమ్ సర్కార్ (కబీర్ సింగ్) ప్లాన్ చేస్తాడు.

అయితే ఆ ట్రస్ట్ ఓ రాజ కుటుంబీకులదనీ, వారి తరపు వారు ఇంకా బతికే ఉన్నారని తెలియడంతో విక్రమ్ సర్కార్ ప్లాన్‍కు అడ్డంకి పడుతుంది.ఇక ఈ కథకు ఏమాత్రం సంబంధం లేని బాలు (సాయిధరమ్ తేజ్), హైద్రాబాద్‌లో ట్యాక్సీ నడుపుకుంటూ తండ్రితో కలిసి జీవిస్తుంటాడు.

అతడి జీవితంలోకి రాజన్ పేరుతో ఓ ఎనిమిదేళ్ళ బాలుడు వస్తాడు.రాజన్ వచ్చాక బాలు కథ పూర్తిగా మారిపోతుంది.

తనకే సంబంధం లేని జాగృతి ట్రస్ట్ కథలోకి బాలు ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది.అసలు బాలుకి, అక్కడి ప్రజలకు సంబంధం ఏంటీ? ఈ రాజన్ అనే బాలుడెవరు? ఆ బాలుడికీ జాగృతి ట్రస్ట్‌కు ఏదైనా సంబంధం ఉందా? ఒక బాధ్యతను తనపై వేసుకున్న బాలు దాన్ని విజయవంతంగా పూర్తి చేశాడా? లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాల్సిందే .

పాజిటివ్ లు :

సినిమాకి అతిపెద్ద పాజిటివ్ కామెడీ , సినిమా ఆద్యంతం చక్కటి కామెడీ తో సాగుతూ ఉంటుంది.హీరో పాత్రకీ – ఎనిమిదేళ్ళ బాలుడికీ మధ్యన సాగే సీన్ లు పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు డైరెక్టర్.

కథ ని పక్కదోవ పట్టించ కుండా సినిమా ని ఇంటరెస్టింగ్ గా చెబుతూ మరొక పక్క ఫన్ ఎలిమెంట్ ని మిస్ అవకుండా చూసుకున్నాడు డైరెక్టర్ హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ నుంచి పుట్టుకొచ్చే ఫన్, వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.సాయి ధరం తేజ యాక్షన్ చాలా ఎనేర్జీ తో సాగింది.

డ్యాన్స్ లూ, డైలాగ్ డెలివరీ లో అతని పంచ్ కనిపిస్తుంది.

కథకు చాలా కీలకం అయిన పాత్రలో బాల నటుడు మైఖేల్ గాంధీ అద్భుతమైన ప్రతిభ చూపి కట్టిపడేశాడు.

సినిమా మొత్తానికీ ఫస్ట్ హాల్ఫ్ భారీ హై లైట్.పృధ్వీ, ప్రభాస్ శీనుల ఎపిసోడ్, రఘుబాబు, వెన్నెల కిషోర్‍ల నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్, విలన్ రవిశంకర్ క్యారెక్టరైజేషన్ నుంచి పుట్టుకొచ్చే కామెడీ బాగుంది .

సినిమా కథ మొత్తం మొట్ట మొదటి అరగంట లో తెలిసిపోవడం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ .ఒక చిన్న కథ తో ఇంటర్వెల్ వరకూ సినిమాని పకడ్బందీ గా తీసుకొచ్చి అక్కడ ట్విస్ట్ రివీల్ చేసినా తరవాత అంతా నెమ్మదిగా సాగుతుంది.పిలదితో సీన్ లు కొన్ని చోట్ల కావాలని ఆర్టిఫీషియల్ గా రాసుకున్నట్టు అనిపిస్తుంది.

సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్ల ట్రాక్‌కు కూడా అవకాశం లేని కొన్ని పరిస్థితులు ముందునుంచే కల్పించడంతో అక్కడ వీరి ప్రయాణం పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

ఇక సినిమాలో పెద్దగా లాజిక్ అన్న అంశానికి చోటే లేదు.పూర్తిగా ఫన్ ఎలిమెంట్‌నే నమ్ముకొని కొన్నిచోట్ల ఎమోషన్‍ను కుదించడం కూడా పెద్దగా ఆకట్టుకోదు.

final

తెలుగు సినిమాలలో ఈ మధ్య అందరూ చూస్తున్న ఎంటర్టైన్మెంట్ కి డైరెక్టర్ అనిల్ రావి పూడి పెద్ద పీట వేసాడు.సినిమాలో కథ చిన్నగా ఉన్న అందులోని ఎమోషన్ ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మంచి ఫన్ గేమ్ ఆడితే జనాలు తేలికగా సినిమా చూస్తున్నారు.

అదే పంథా లో సాగుతుంది సుప్రీం సినిమా.రొటీన్ జోనర్ నీ , సాయి కి అచ్చొచ్చిన విధానమే మళ్ళీ ఎంచుకున్న డైరెక్టర్ అక్కడక్కడా నిరాశ పరిచాడు కానీ మొత్తంగా పరవాలేదు అనిపించుకునే కామెడీ సినిమా ఇది.కథ మొత్త ముందరే రివీల్ అవ్వకుండా ఉంటే సినిమా రేంజ్ మరొకలా ఉండేది.కానీ ఏదేమైనా సుప్రీం మాత్రం కామెడీ తో నవ్వించే ఒక మంచి ప్రయత్నం.వీక్ ఎండ్ లో ఫ్యామిలీ తో తేలికగా చూసేయ్యగల సినిమా.

రేటింగ్ : 3/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube