సాయి తేజ్ లవ్ చేసిన అమ్మాయిని తన స్నేహితుడు కూడా…  

Sai tej, Tollywood Mega Supreme hero, college love story, Tollywood, Solo Brathuke So better, - Telugu College Love Story, Sai Tej, Solo Brathuke So Better, Tollywood, Tollywood Mega Supreme Hero

ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుబ్బు “సోలో బ్రతుకే సో బెటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో మెగా సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తుండగా, ఇస్మార్ట్ శంకర్ చిత్ర ఫేమ్ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

 Supreme Mega Hero Sai Tej College Love Story

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు కూడా పూర్తయ్యాయి.దీంతో తాజాగా ఈ చిత్ర హీరో సాయి తేజ్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఈ కార్యక్రమంలో భాగంగా తన జీవితంలో జరిగిన లవ్ స్టోరీ గురించి తెలిపాడు.

సాయి తేజ్ లవ్ చేసిన అమ్మాయిని తన స్నేహితుడు కూడా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో భాగంగా తను కాలేజీలో చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు.

కానీ తన ప్రేమ విషయం గురించి ఆమెకు చెప్పేలోపే ఆమె కాలేజీ నుంచి వెళ్లి పోయిందని, కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తాను ప్రేమించిన అమ్మాయిని తన స్నేహితుడు కూడా ప్రేమించాడని తనకు చివర్లో ఆ విషయం గురించి తెలిసిందని చెప్పుకొచ్చాడు.అయితే తాను ప్రేమించిన అమ్మాయి వివరాలను మాత్రమే సాయి తేజ్ చెప్పడానికి ఇష్ట పడ లేదు.

దీంతో కొందరు మెగా అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ సాయి తేజ ప్రేమించినటువంటి ఆ అమ్మాయి పేరు  తెలియజేయాలని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో సాయి తేజ హీరోగా నటించిన చిత్రలహరి మరియు ప్రతి రోజు పండగే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి.

దీంతో సాయి తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్” చిత్రం ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.కాగా ఇటీవలె టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవాకట్ట దర్శకత్వం వహిస్తున్నటువంటి మరో చిత్రంలో కూడా నటించేందుకు సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#TollywoodMega #Sai Tej #SoloBrathuke

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Supreme Mega Hero Sai Tej College Love Story Related Telugu News,Photos/Pics,Images..