రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం అల్టిమేటం  

Karnataka Crisis: Sc Tells Dissident Mlas To Meet Speaker To Resign,-sc Tells Dissident Mlas To Meet Speaker,telugu Viral News,రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం అల్టిమేటం

కర్ణాటక రాజకీయం సుప్రీం కోర్టు కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టీస్ రంజాన్ గొగోయ్ ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు స్పీకర్ ముందుకు హాజరు అవ్వాలంటూ అల్టిమేటం జారీ చేసింది. దీనితో కర్ణాటక రాజకీయం ఆటో ఇటో తేలిపోనుంది. ఇటీవల కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ముంబై లో మకాం వేసిన సంగతి తెలిసిందే. అయితే వారి రాజీనామాలను పరిశీలించిన కర్ణాటక అసెంబ్లీ స్పీఎకర్ రమేష్ వాటిలో 8 మంది లేఖలు జన్యూన్ గా లేవని తెలిపారు. దీనితో తమ రాజీనామాలను వెంటనే ఆమోదించేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు..

రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం అల్టిమేటం -Karnataka Crisis: SC Tells Dissident MLAs To Meet Speaker To Resign,

వారి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పిటిషన్ దాఖలు చేయగా,తాము స్వచ్ఛందంగా రాజీనామాలు ఇస్తే స్పీకర్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని, 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుంటే తమను కూడా అదేరోజు కలవాలని ఆదేశించడం వెనుక దురుద్దేశం ఉందంటూ ఆ పిటీషన్ లో రెబెల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఈ పిటిషన్‌ ను అత్యవసరంగా విచారించి రెబల్స్ ఎమ్మెల్యేలందరూ ఈరోజు సాయంత్రంలోపు స్పీకర్‌ను కలవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా సాయంత్రం 6 గంటల లోపు స్పీకర్ ముందుకు వెళ్లాలని సూచించింది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. మరోపక్క ఆ రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని డీజీపీని ధర్మాసనం ఆదేశించినట్లు తెలుస్తుంది. ఒకవేళ అవసరం ఉంటే దీనికి సంబంధించిన తదుపరి విచారణ రేపు చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.