స్పీకర్ కు ఆ అధికారం లేదని స్పష్టం చేసిన సుప్రీం

కర్ణాటక లో కొద్దీ కాలం క్రితం 17 మంది ఎమ్మెల్యేల పై స్పీకర్ రమేష్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.కర్ణాటక పూర్వ సీఎం కుమారస్వామి పై అవిశ్వాస తీర్మానం సమయంలో అసెంబ్లీ కి హాజరు కానీ 17 మంది ఎమ్మెల్యేల పై అప్పటి స్పీకర్ రమేష్ అనర్హత వేటు వేసి, 2025 వరకూ వారిపై వేసిన అనర్హత వేటు వేశారు.

 Supreme Court Upholds Mlas-TeluguStop.com

అయితే దీనిపై ఆ 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా గత నెల 25 న ఈ కేసు తుది తీర్పును సుప్రీం రిజర్వ్ లో ఉంచింది.అయితే తాజాగా ఈ కేసు లో తీర్పును వెల్లడించగా అనర్హత వేటు వేసిన స్పీకర్ పై జస్టిస్ ఎన్వీ రమణ,సంజీవ్ ఖన్నా,కృష్ణమురారి లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం మండిపడింది.ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎవరినీ నిషేదించలేమని, ఆ అధికారం స్పీకర్ కు లేదని అభిప్రాయపడింది.2025 వరకూ వారిపై వేసిన అనర్హత వేటును తొలగిస్తున్నామని స్పష్టం చేసింది.మరోపక్క వారిపై పడ్డ అనర్హత వేటును సుప్రీం సమర్థించింది కూడా.వారు ఇలా పార్టీ ఫిరాయించడం అనేది ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసిన ప్రజలను వారు మోసం చేసినట్టేనని అభిప్రాయపడింది.

మరోమారు ఇటువంటి తప్పు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని, ఫిరాయింపులను ప్రోత్సహించరాదని సూచించింది.

Telugu Karnataka Mlas, Karnataka, Supreme, Yadurappa-Telugu Political News

అలానే వారిపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ కర్నాటకలో ఉప ఎన్నికల్లో తమను పోటీకి అనుమతించాలని వారు చేసిన విజ్ఞప్తి ని పరిగణలోనికి తీసుకున్న ధర్మాసనం వారందరికీ కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేసింది.సుప్రీం నిర్ణయం తో అనర్హత ఎమ్మెల్యేలకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube