సివిల్స్ చివరి ప్రయత్న అభ్యర్థులకు సుప్రీంకోర్టు షాక్...

కరోనా నేపథ్యంలో చాలా మంది విద్యార్ధులు పరీక్షలు రాయలేక పోయిన విషయం తెలిసిందే.అదీగా సివిల్స్ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కాలేకపోయారు.

 Supreme Court Shock For Civils Last Attempt-TeluguStop.com

మరి కొన్ని సార్లు సివిల్స్ పరీక్షలూ వాయిదా పడ్డాయి.ఈ నేపధ్యంలో కొందరికి ఇదే చివరి సివిల్స్ పరీక్షలు రాసే అవకాశమని పేర్కొంటూ ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్ లో మరో అవకాశం ఇవ్వాలని కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే గత ఏడాది సివిల్స్ చివరి ప్రయత్న అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఊరటనివ్వలేదు.ఈ ఏడాది పరీక్ష రాసే అర్హత వయసు లేని వారికి మరోసారి సివిల్స్ రాసే అవకాశం ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

 Supreme Court Shock For Civils Last Attempt-సివిల్స్ చివరి ప్రయత్న అభ్యర్థులకు సుప్రీంకోర్టు షాక్…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చివరి అటెంప్ట్ పరీక్షకు హాజరు కాకపోయినా ఆ అవకాశం పోయినట్టేనని, గతేడాదితోటే వారి అవకాశాలన్నీ అయిపోయాయని వెల్లడించింది.వయసున్న వారే మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇకపోతే ఈ ఏడాది ప్రిలిమ్స్ కు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది.మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది.

కాగా జూన్ 27న సివిల్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

#Supreme Court #Candidates #SupremeCourt #Last Attempt #Shock

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు