బీజేపీ మీద విమర్శలు చేయబోతే సుప్రీం కోర్ట్ కి తగిలాయి!

దేశ రాజకీయాలలో ప్రధాని పీఠం మీద కూర్చోవాలనే లక్ష్యంతో లోక్ సభ ఎన్నికలలో బీజేపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ దూసుకుపోతున్న రాహుల్ గాంధీకి మాటిమాటికి అవాంతరాలు ఎదురవుతున్నాయి.తాను బీజేపీని టార్గెట్ గా చేసిన విమర్శలు ఏదో ఒక వర్గానికి తగలడం వారు ఆగ్రహం వ్యక్తం చేయడం, మళ్ళీ వారికి రాహుల్ సారీ చెప్పడం ప్రస్తుతం కామన్ గా మారిపోయింది.

 Supreme Court Serious On Rahul Gandhi-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా రఫేల్‌ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ధిక్కార నోటీసులు జారీ చేసింది.

రాఫెల్ డీల్‌కు సంబంధించి లీకైన డాక్యుమెంట్లపై సమీక్షకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంలో రాహుల్ మోదీపై చౌకీదార్ విమర్శలు చేశారు.

ఇది తమ నైతిక విజయం అని, కాపలదారుడే దొంగ అని సుప్రీం స్పష్టం చేసిందని చెప్పారు.అయితే చౌకీదార్ చోర్ అని తాను చేసిన వ్యక్తిగత విమర్శలను కోర్టు తీర్పుకు ఆపాదించడంపై బీజేపీ కోర్టు ధిక్కరణ కింద ఆయనపై పిటిషన్ దాఖలు చేసింది.

ఇక ఈ నెల 30వ తేదీన రఫేల్‌పై రివ్యూ పిటిషన్‌తోపాటే, కోర్టు ధిక్కార పిటిషన్‌పైనా విచారణ జరుపుతామని తెలిపింది.తన ప్రకటనని బీజేపీ వక్రీకరించింది అని చెప్పి క్షమాపణలు చెప్పారు.

అయితే రాహుల్ క్షమాపణలో తప్పు చేశాననే భావన కనిపించలేదని కోర్ట్ అతని మీద సీరియస్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube