కేంద్రం పై సీరియస్ అయిన సుప్రీం కోర్టు..!!

వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు అనే మమతా బెనర్జీ మరియు ఇంకా చాలా మంది జాతీయ స్థాయి నాయకులు అదే రీతిలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ సీరియస్ అవ్వడం జరిగింది.

 Supreme Court Serious On Central Government Over Corona Vaccination, Trs,ktr, Su-TeluguStop.com

తాజాగా కేంద్రంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యింది.దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారా లేదా అంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వాక్సినేషన్ విధానాన్ని సుప్రీం తప్పు పట్టింది.

దేశ ప్రజలందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారా లేదా అంటూ గట్టిగా ప్రశ్నించింది.

దేశంలో మిగిలి ఉన్న జనాభాకు ఎప్పుడు వ్యాక్సిన్ ఇస్తారో అన్నదాని పై నివేదిక ఇవ్వాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది.అదేవిధంగా .వ్యాక్సిన్ అన్ని కంపెనీలు డోసులు ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు చేశారని.పూర్తి వివరాలు అందించాలని కేంద్రాన్ని సుప్రీం కోరింది.

అదే విధంగా దేశంలో ఎంతమందికి టీకాలు ఇప్పటి వరకు వేయడం జరిగింది.? సింగిల్ డోసులు ఎంతమందికి ఇచ్చారు.? రెండో డోస్ ఎంతమంది తీసుకున్నారు.? గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరిగింది.?వంటి వివరాలు పూర్తి డేటా నివేదిక రూపంలో ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.రెండు వారాల్లో అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది.

ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube