ఇకపై ఆధార్‌ లేకున్నా బతికేయొచ్చు... సామాన్యులందరికి అతి పెద్ద ఊరట

ఇండియాలో ఆధార్‌ ఉంటేనే బతకాలని, ఆధార్‌ లేకుంటే బతికే హక్కే లేదు అన్నట్లుగా కొన్ని రోజుల వరకు ప్రరిస్థితి ఉంది.ప్రతి విషయానికి ప్రతి దానికి కూడా ఆధార్‌తో లింక్‌ పెట్టారు.

 Supreme Court Rules Aadhaar Not Mandatory-TeluguStop.com

కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక ఆధార్‌ అనుసంధానం మరీ ఎక్కువ అయ్యింది.ప్రతి దానికి కూడా ఆధార్‌ ఇవ్వాల్సిందే అంటూ కండీషన్‌ పెట్టారు.

ప్రతి విషయంలో కూడా ఆధార్‌ అడుగుతుండటంతో కొన్ని సార్లు చిరాకు వేసింది.పుట్టాలంటే ఆధార్‌, చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలకు కూడా ఆధార్‌ అడిగిన పరిస్థితి.

అందుకే సోషల్‌ మీడియాలో ఆధార్‌ లేని వారు ఇండియాలో బతికి లేనట్లే అంటూ కామెంట్స్‌, కామెడీ పోస్ట్‌లు తెగ వచ్చేవి.

ఆధార్‌ కారణంగా ఇండియాలో భారీ ఎత్తున ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా ఉన్నాయని ప్రభుత్వం సంకలు గుద్దుకుంటూ ఉంటే సామాన్యులు మాత్రం తమ డేటా మొత్తం చౌర్యంకు గురి అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సిమ్‌ కార్డు కొనుగోలు నుండి విమానంలో ప్రయాణించే వరకు ప్రతి దానికి కూడా ఆధార్‌ ఆధార్‌ తప్పనిసరి చేయడంతో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.అలాంటి నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చి సామాన్యుల నెత్తిన పాలు పోసింది.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఇకపై ఆధార్‌ను ఏ ఒక్కరు తప్పనిసరి అంటూ అడగరు.ఆధార్‌ కార్డు ఉంటేనే ఆ పని అవుతుందనేది లేదు.ప్రతి ఒక్కరు కూడా ఆధార్‌ కార్డును తమ ఇష్టప్రకారంగా వినియోగించుకోవచ్చు.అంటే ఎక్కడైనా ఆధార్‌ కార్డు ఇచ్చేందుకు ఆసక్తి లేకుంటే ఇవ్వను అంటూ చెప్పొచ్చు.ఉదాహరణకు బ్యాంకులో ఖాతా ఓపెన్‌ చేయాలంటే గతంలో ఆధార్‌ తప్పనిసరి.కాని ఇప్పుడు ఆధార్‌ అవసరం అస్సలు లేదు.

నీకు ఇష్టం ఉంటే ఇవ్వొచ్చు లేదంటే మరేదైనా ఐడీ ఫ్రూప్‌ ఇవ్వొచ్చు.

ఇలా చేయడం వల్ల వ్యక్తిగత భద్రతకు సెక్యూరిటీ దక్కుతుందని అంతా భావిస్తున్నారు.వ్యక్తి గత విషయాలను చోరీ కాకుండా చూసుకునేలా ఈ నిర్ణయం చాలా మంచిదని, ఇకపైఆధార్‌ లేకుండానే బతికేయవచ్చు అంటూ సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రతిదానికి కూడా ఆధార్‌ వివరాలు ఇవ్వడం వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అయితే ఇప్పటికే 90 శాతం మంది ఆధార్‌ నెంబర్‌లు, డేటా ఎక్కడికి చేరాలో అక్కడకు చేరిపోయాయి.ఇప్పటికే భద్రత అంతా పోయింది.ఈ సమయంలో ఆధార్‌ అవసరం లేదన్నా ప్రయోజనం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube