భర్తను భార్య చంపితే మర్డర్‌ కాదు.. కాని 10 యేళ్లు శిక్ష మాత్రం అనుభవించాల్సిందే

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు కొన్ని సార్లు విచిత్రంగా అనిపిస్తాయి.మానవతా దృక్పదంతో ఆలోచిస్తూనే, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా తీర్పులు ఇస్తూ ఉంటారు.

 Supreme Court Relief For Husband Killer Who Was Called A Prostitute-TeluguStop.com

కింది కోర్టుల్లో అన్యాయం జరిగినా పై కోర్టు అయిన సుప్రీం కోర్టులో మాత్రం తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉన్న ప్రజలకు మరోసారి సుప్రీం కోర్టు చిత్రమైన తీర్పు ఇచ్చి మానవతా హృదయాన్ని చాటుకోవడంతో పాటు న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చేసింది.సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశం మొత్తం చర్చనీయాంశం అవుతుంది.

ఇంతకు కేసు ఏంటీ అంటే…


తమిళనాడు రాష్ట్రం మద్రాసుకు చెందిన ఒక వ్యక్తి తన భార్యను మరియు కూతురును పదే పదే వేదిస్తూ ఉండేవాడు.తాగి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉండేవాడు.

ప్రతి రోజు కూడా భార్యతో పాటు కుమార్తెను కూడా వ్యభిచారం చేస్తున్నారు మీరు, నలుగురితో పడుకుని సంపాదిస్తున్నారు అంటూ ఇష్టం వచ్చినట్లుగా దుర్బాషలాడాడు.దాంతో ఆ భార్యకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

తనను మాత్రమే కాకుండా కూతురును కూడా వ్యభిచారి అంటూ నీచంగా మాట్లాడటంతో ఆమె ఆవేశానికి లోనై హత్య చేయాలని నిర్ణయించుకుంది.

భర్తను మరో వ్యక్తితో కలిసి హత్య చేసి దహనం కూడా చేసేసింది.ఎవరికి అనుమానం రాకుండా ఉంది.ఈ సంఘటన జరిగిన 40 రోజుల తర్వాత హత్య విషయం పోలీసులకు తెలిసింది.

వెంటనే పోలీసులు ఎంక్వౌరీ చేయడం, ఆ తర్వాత ఆమెను అరెస్ట్‌ చేయడం చేశారు.మద్రాసు హైకోర్టు హత్య నేరం కింద ఆమెకు శిక్ష విధించింది.అయితే న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన ఆమెకు సుప్రీం చిత్రీమైన తీర్పు ఇచ్చింది.

ఏ భారత స్త్రీ కూడా తనను భర్త వ్యభిచారి అంటూ దూషిస్తే తట్టుకోలేదు.

అలాంటి భర్తను చంపినా తప్పుకాదు, భార్యను అంతలా తిట్టడం కరెక్ట్‌ కాదు కనుక, భర్తను ఆ భార్య చంపడం తప్పు కాదు, అది హత్య అసలు కాదని సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది.భర్తను హత్య చేసిన నేరం కింద కాదు కాని, ఒక హత్య కేసు కింద ఆమెకు సుప్రీం కోర్టు పదేళ్లు సాదారణ జైలు శిక్ష విధించింది.

కల్పబల్‌ హోమోసైడ్‌ కింద సుప్రీం కోర్టు ఆమెకు శిక్ష విధించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube