ఏపీ సర్కార్ కు ఝలక్, ఈసీ నిర్ణయాన్ని సమర్ధించిన సుప్రీం  

Supreme Court Rejects Ap Government Petition On Postponement Of Local Body Elections - Telugu Elections, Supreme Court,

ఏపీ సర్కార్ కు సుప్రీం న్యాయస్థానం గట్టి ఝలక్ ఇచ్చింది.ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ సుప్రీం తీర్పు వెల్లడించింది.

 Supreme Court Rejects Ap Government Petition On Postponement Of Local Body Elections - Telugu Elections, Supreme Court,-Latest News-Telugu Tollywood Photo Image

దీనితో ఎన్నికల వాయిదా విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.తమను సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేసిందని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే.

అయితే ఎన్నికల వాయిదాపై ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.ఈ మేరకు ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టేసింది కూడా.

ఏపీ సర్కార్ కు ఝలక్, ఈసీ నిర్ణయాన్ని సమర్ధించిన సుప్రీం - Supreme Court Rejects Ap Government Petition On Postponement Of Local Body Elections - Telugu Elections, Supreme Court,-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇక్కడ ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించినట్లు తెలుస్తుంది.ఎలక్షన్ కమిషన్ ని ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తి వేయమని ఆదేశించినట్లు సమాచారం.

ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే దానిపై ఎస్‌ఈసీదే తుది నిర్ణయమన్న సుప్రీంకోర్టు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించింది.సీఎం జగన్ అనుమతి లేకుండా ఎన్నికల కమీషన్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం పై జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్‌ ఇష్టమని స్పష్టం చేసింది.

అయితే, ఎన్నికల కోడ్‌ను తక్షణమే ఎత్తివేయాలని సుప్రీం ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించింది.తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కోడ్ ఎత్తివేయాలని సూచించింది.కొత్త పథకాలను తీసుకురావొద్దని మాత్రం జగన్ ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.

ఉన్న పథకాలను మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చని కోర్టు తేల్చి చెప్పింది.కమిషన్ చెప్పినట్టే ఆరు వారాల తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి.

ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తాజా వార్తలు

Supreme Court,supreme Court Rejects Ap Government Petition On Postponement Of Local Body Elections- Related Telugu News,Photos/Pics,Images..