జగన్ మెడకు పంచాయితీ ? సుప్రీం సంచలన తీర్పు

అంతా ఊహించినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల పై అటు ప్రభుత్వానికి ఇటు పిటిషన్ వేసిన ఉద్యోగ సంఘాలకు కానీ ఊరట లేకుండా ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.యధావిధిగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

 Supreme-court Permission On Ap Local Body Electionsjagan   Nimmagadda- Elections-TeluguStop.com

ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో,  దానిపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఏపీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం యధావిధిగా ఎన్నికలు జరుగుతాయి అంటూ తన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

  ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.ఏపీలో ఎన్నికలు నిర్వహించడానికి కరోనా వ్యాక్సిన్ అడ్డంకి ఏమాత్రం కాదని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకోము అంటూ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది.

అలాగే ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ పైనా స్పందించిన ధర్మాసనం ఉద్యోగ సంఘాలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగ సంఘాలు జోక్యం సరికాదని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం సూచించింది.

అసలు రెండు వ్యవస్థల మధ్య ఏర్పడిన వివాదానికి మీకు ఏ సంబంధం అంటూ ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.రాజ్యాంగ ప్రక్రియలో ఎన్నికలు భాగమని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరగట్లేదా అని సుప్రీం కోర్ట్ జస్టిస్ కిషన్ కౌల్ ప్రశ్నించారు.ఎస్ ఈ సీని తప్పుపడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది.

స్వయంగా సుప్రీం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ఈ విధంగా తీర్పు వెలువరించడం తో దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంపై ఏపీ ప్రభుత్వం కీలక నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైచేయి సాధించడంతో ఇప్పుడు తాము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

 సుప్రీం తీర్పుపై ఏపీ ప్రభుత్వం గానీ, అటు వైసీపీ కీలక నాయకులు కానీ ఏ విధంగా స్పందించాలో అర్థం కాకుండా ఉంది.ఏదిఏమైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లకూడదని జగన్ భావిస్తూ వచ్చారు.

కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ ఈ విషయంలో జగన్ కు ఎదురు దెబ్బ తగలడంతో ఇప్పుడు ఆయన దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube