దిశ ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ను

దిశ ఎన్‌కౌంటర్‌ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.ఎన్‌కౌంటర్‌పై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

 Supreme Court On Disha Encounter Case-TeluguStop.com

ఈ ఘటనపై అనేక అనుమానాలన్నాయని వ్యాఖ్యానించింది.

ఎన్‌కౌంటర్‌పై నిష్ఫాక్షిక విచారణ జరగాలని కోర్టు పేర్కొంది.

పోలీసుల వాదనలో కొన్ని అంశాలపై అనుమానం వ్యక్తం చేసిన కోర్టు…దీనిపై సమగ్ర విచారణ జరగాలని తెలిపింది.ఈ కేసులో పిటిషనర్ మణిని మీరెంందుకు కోర్టును ఆశ్రయించారని కోర్టు ప్రశ్నించింది.

Telugu Disha, Supreme Disha-

ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయని పిటిషనర్ సమాధానం ఇచ్చారు.ప్రభుత్వం తరపున రోహత్గి తమ వాదనలు వినిపించారు.తప్పని పరిస్థితుల్లోనే ఎన్‌కౌంటర్ జరిగిందని రోహిత్గి సమాధానం చెప్పారు.దీంతో ఎన్‌కౌంటర్ సమయంలో ఎంతమంది పోలీసులున్నారు.? వాళ్ల ర్యాంక్ ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఎన్‌కౌంటర్ జరిగిన తీరు విచారణ అవసరాన్ని చెబుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగనివ్వండని సుప్రీంకోర్టు సూచింది.

పిటిషనర్ మణి నిందితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోర్టును కోరగా.

దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది.వారు చేసిన నేరాన్ని తాము మరవలేదని, వారికి పరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube