ఏళ్ల నాటి డిమాండ్ : ఎన్నారైల ఓటు హక్కుపై ఏప్రిల్‌లో సుప్రీం విచారణ  

Supreme Court Of India To Hear Nri Voting Rights Plea In April - Telugu Lawyer Bheerin, Nri Fraxi Voting, Nri Voting Rights, Shamshir Vayalil, Supreme Court Of India, , Vps Health Care Chief

ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కులపై పిటిషన్‌ను ఏప్రిల్‌లో పరిష్కరిస్తామని భారత సుప్రీంకోర్టు గురువారం తెలిపింది.వీపీఎస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ షంషీర్ వయాలీల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టీస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది.

Supreme Court Of India To Hear Nri Voting Rights Plea In April - Telugu Lawyer Bheerin, Nri Fraxi Voting, Nri Voting Rights, Shamshir Vayalil, Supreme Court Of India, , Vps Health Care Chief-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీనికి సంబంధించిన వివరాలను షంషీర్ వెల్లడించారు.ఇది అమల్లోకి వచ్చిన లక్షలాది మంది ఎన్నారైలు తమ ఓటు హక్కును ఎక్కడి నుంచైనా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

మాతృదేశంలోని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడి డిమాండ్ అని ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న దీనిపై కోర్టు సానుకూలంగా స్పందిస్తుందని షంషీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యాయవాది బీరన్ మాట్లాడుతూ… ఆరేళ్ల క్రితం దాఖలైన ఈ పిటిషన్‌కు సంబంధించి అనేక ప్రభుత్వ ఉత్తర్వులు కోర్టు దృష్టికి తీసుకొచ్చానని చెప్పారు.దీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్న ఈ డిమాండ్‌పై చర్యలు తీసుకోవడంలో జరిగిన ఆలస్యాన్ని న్యాయస్థానం గుర్తించిందని బీరెన్ వెల్లడించారు.దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి దిశానిర్దేశం చేయనుందని ఆయన తెలిపారు.

ఎన్ఆర్ఐ ప్రాక్సీ ఓటింగ్ హక్కులను అనుమతించే బిల్లును లోక్‌సభ 2018 ఆగస్టులోనే ఆమోదించినప్పటికీ, 16వ లోక్‌సభను రద్దు చేసిన తర్వాత అది ముగిసింది.తర్వాత జూన్ 2019లో దీనికి సంబంధించి తాజా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రివర్గం తెలిపినప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు తమ సొంత నియోజకవర్గాల్లో ఓటును వేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ప్రాక్సీ ఓటింగ్ విధానం ద్వారా ఎన్నారైలు తమ కార్యాలయం నుంచి ఈ-బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా అనుమతించాల్సిందిగా ఈ పిటిషన్‌లో కోరారు.

ప్రవాస భారతీయులు ప్రాక్సీ ఓటింగ్ ద్వారా ఓటు వేయడానికి అనుమతించేలా ఎన్నికల చట్టాలను సవరించాల్సిందిగా 2015లో ఎన్నికల కమీషన్‌కు చెందిన నిపుణుల కమిటీ కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసింది.విదేశీ వ్యవహారాల శాఖ అంచనా ప్రకారం.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో సుమారు 3.10 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారు.అదే సమయంలో 10 వేల నుంచి 20 మంది ప్రవాస భారతీయులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి.

ఎన్నారైలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు గాను ఆధార్ కార్డ్‌ను ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తింపు కార్డుతో అనుసంధానించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెప్పాయి.

అంతేకాకుండా డిజిటల్ మీడియా ద్వారా ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే సాంకేతిక పరిజ్ఞానం రూపొందించే పనిలో ఐఐటీ మద్రాస్‌తో కలిసి ఈసీ కలిసి పనిచేస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి.ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నారైలు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో మాత్రమే ఈ సదుపాయం ఉంది.

తాజా వార్తలు

Supreme Court Of India To Hear Nri Voting Rights Plea In April-nri Fraxi Voting,nri Voting Rights,shamshir Vayalil,supreme Court Of India,vps Health Care Chief Related....