సుప్రీం కు చేరిన నిర్భయ కేసు, దోషులకు నోటీసులు

Supreme Court Notice Tonirbhaya Convicts On Centres Plea Against Highcourt Verdict

ఢిల్లీ నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో దోషులు అయిన వారికి విధించిన ఉరిశిక్ష మాత్రం అమలు కావడం లో అనేక అవాంతరాలు చోటుచేసుకుంటున్నాయి.

 Supreme Court Notice Tonirbhaya Convicts On Centres Plea Against Highcourt Verd-TeluguStop.com

ఈ క్రమంలో ఈ నెల 1 వ తేదీ ఉదయం 6 గంటలకు అమలుకావాల్సిన వారి ఉరిశిక్షలపై ఢిల్లీ పాటియాలా కోర్టు స్టే విధించడం తో వారి ఉరిశిక్షలు అమలుకాలేదు.ఢిల్లీ నిర్భయ కేసులో దోషులకు ఉరి వేయాలనుకున్న కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టడంతో… ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టాలంటూ… కేంద్రం పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది.

దీనిపై ఈ కేసులో దోషులైన నలుగురికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసినట్లు తెలుస్తుంది.సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే… ఉరి ఎప్పుడు వెయ్యాలో నెక్ట్స్ డేట్ ఫిక్స్ చెయ్యమని ట్రయల్ కోర్టును కేంద్ర అధికారులు కోరవచ్చని స్పష్టం చేసింది.

సో, ఇప్పుడు ట్రయల్ కోర్టు నిర్ణయం కీలకం కాబోతోంది.నిర్భయ దోషులు… ఒకరి తర్వాత ఒకరుగా క్షమాభిక్ష అభ్యర్థనలు పెట్టుకుంటుంటే… అవి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటూ… శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది.

నలుగురు దోషులకూ ఒకేసారి ఉరి వెయ్యాలన్నది సుప్రీంకోర్టు 2017లో ఇచ్చిన తీర్పు.అలా కాకుండా….

అభ్యర్థన పిటిషన్లు లేని వారికి ముందుగా ఉరి వేసేస్తామని కేంద్రం కోరగా… అందుకు ట్రయల్ కోర్టు ఒప్పుకోలేదు.అందరికీ ఒకేసారి ఉరి వెయ్యాలనడంతో… ఇప్పటికే రెండుసార్లు ఉరి శిక్ష అమలును వాయిదా పడింది.

తాజాగా ముగ్గురి క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొట్టివేశారు.అందువల్ల నాలుగో వ్యక్తి పవన్ గుప్తా… ఇప్పటివరకూ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదు.

అలాగే సుప్రీంకోర్టులో క్యూరేటివ్ ప్లీ కూడా వేయలేదు.

అందువల్ల నలుగురికీ కలిపి ఇప్పుడు ఒకేసారి ఉరి వేసేందుకు ఛాన్స్ ఉంది.

ఈ క్రమంలో ట్రయల్ కోర్టు నెక్ట్స్ డేట్ ఎప్పుడంటే అప్పుడు ఉరి వేయవచ్చు.మరోపక్క నిర్భయ తల్లిదండ్రులు కూడా తాజాగా ట్రయల్ కోర్టును ఆశ్రయించి దోషులకు ఉరి వేయాలి అంటూ కొత్త తేదీని ప్రకటించాలి అంటూ కోరారు.

మరి వారి ఉరిశిక్షలు ఎప్పుడు అమలు అవుతాయో అన్న అంశం పెద్ద ఉత్కంఠ ను రేపుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube