ఆసక్తికరంగా మారిన మధ్యప్రదేశ్ రాజకీయాలు, కమల్ నాథ్ కు సుప్రీం నోటీసులు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టు వరకు చేరుకున్న విషయం తెలిసిందే.ఈ నెల 16 న మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సర్కార్ ఎదుర్కోవలసిన ఫ్లోర్ టెస్ట్ కరోనా నేపథ్యంలో అసెంబ్లీ ని 26 వ తేదీకి వాయిదా వేయడం తో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 Supreme Court Notice To Kamal Nath Over Bjp Trust Vote-TeluguStop.com

ఈ నేపథ్యంలో అసెంబ్లీ లో ఫ్లోర్ టెస్ట్ జరిగేలా చూడాలి అంటూ బీజేపీ పార్టీ సుప్రీం కోర్టు లో పిటీషన్ ను దాఖలు చేయడం తో విచారించిన కోర్టు నోటీసులు జారీ చేసింది.కమల్ నాథ్ ప్రభుత్వానికి,స్పీకర్ కు, అలానే ప్రిన్సిపల్ సెక్రెటరీ కి,గవర్నర్ లాల్ జీ టాండన్ లకు సైతం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళవారం లాయర్లు ఎవరూ కోర్టుకు హాజరు కాకపోవడం తో బుధవారం దీనిపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ తరపున లాయర్లు ఎవరూ హాజరు కాకపోవడం తో బీజేపీ తరపు న్యాయవాది ముకుల్ రోహ్తాగి తీవ్రంగా స్పందించారు.

ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, కావాలనే వారు కోర్టుకు హాజరు కాలేదని ఆరోపించారు.ఇప్పుడు కమలనాథ్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇచ్చినా… సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అటుతిరిగీ ఇటుతిరిగీ చివరకు స్పీకర్ అసెంబ్లీలో బలనిరూపణ అమలు చెయ్యక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది మొదలు.అసెంబ్లీ పరిణామాలు, గవర్నర్ ఆదేశాలు, స్పీకర్ నిర్ణయాలు.ప్రతీది ఆసక్తిగా మారింది.

బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఆదేశిస్తే… కరోనా ప్రభావం ఉందని స్పీకర్ అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేశారు.తమకు పూర్తి మెజారిటీ ఉందని కమల్‌నాథ్ సర్కారు చెబుతోంది.

అయితే, స్పీకర్ నిర్ణయంతో నొచ్చుకున్న గవర్నర్… కమల్‌నాథ్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు.మంగళవారం నాడు బలపరీక్ష నిరూపించుకోవాలని, లేనిపక్షంలో మెజారిటీ లేదని నిర్ణయానికి రావాల్సి వస్తుందని హెచ్చరించారు.

దీంతో ఇకపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube