పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయటం తెలిసిందే.తాజాగా ఈ అఫిడవిట్ పై సుప్రీంకోర్టు విచారణ స్టార్ట్ చేసి.

 Supreme Court Makes Key Remarks On Ap Government Over Exam Administration-TeluguStop.com

ఏపీ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేసింది.పరీక్షల నిర్వహణ విషయంలో కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు… సిబ్బందికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.

ఈ నేపధ్యంలో ఒక్కో గదిలో పరీక్షల విషయంలో కేవలం 15 నుండి 20 మంది విద్యార్థుల చేత మాత్రమే పరీక్షలు రాయించాలని అనుకుంటున్నట్లు అఫిడవిట్ లో పేర్కొనగా.అలా అయితే 36,634 గదులు అవసరమవుతాయని అది ఎలా సాధ్యం అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

 Supreme Court Makes Key Remarks On Ap Government Over Exam Administration-పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పరీక్షలు నిర్వహించటం మాత్రమే కాదు మూల్యాంకనం చేయాలి ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభించాలి.ఇటువంటి విషయాలు మీ అఫిడవిట్లో కనబడలేదు అంటూ ఏపీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు మండిపడింది.ఈ నేపథ్యంలో అవసరమైతే సిపిఎస్ఈ, యూజీసీ, ఐసిఎస్ఈ సలహాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.ఈ నేపథ్యంలో కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలపగా… ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఎట్టి పరిస్థితిలో పరీక్షలు నిర్వహించాలని ముందుకు వెళితే ఏ విద్యార్థికైనా కరోనా సోకిన మరణిస్తే ఒక్కొక్కరి కుటుంబానికి కోటి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు హెచ్చరించి.విద్యార్థుల ప్రాణాలు కు సంబంధించి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

కరోనా సెకండ్ వేవ్ దేశంలో అనేక విషాదఛాయలు మిగిల్చింది.మరికొన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు పరీక్షల విషయంలో ఇంత మొండిగా ఎందుకు వ్యవహరించటం అంటూ ప్రభుత్వం పై సుప్రీం కోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

#Supreme Court #Exams #AP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు