ఇండియా తొలి మహిళా చీఫ్ జస్టిస్ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు.. !

భారతదేశంలో మహిళలకు పెద్దపీఠ వేస్తున్నాం అని చెప్పుకునే మాటలు పెదవుల వరకే ఆగిపోతున్నాయి.ఆచరణలో మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది.

 Supreme Court Judge Makes Key Remarks On India First Woman Chief-TeluguStop.com

ఇలా ఇప్పటి వరకు మహిళలు నోచుకోని ఎన్నో పదవులు, అధికారాలు ఇంకా మనదేశంలో ఉన్నాయంటే ఆశ్చరం కలుగుతుంది.
ఇదిలా ఉండగా ఒక్క మహిళకు కూడా ఇప్పటి వరకు సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్ గా అవకాశం దక్కలేదు.

కానీ ఇప్పటివరకూ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఎనిమిది మంది మహిళలు సేవలందించగా, 2014 తరువాత కేవలం ముగ్గురికి మాత్రమే ఈ అవకాశం లభించింది.
అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ సునందా భండారా ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంద్గర్భంగా సమీప భవిష్యత్తులోనే భారతావని తొలి మహిళా చీఫ్ జస్టిస్ ను చూడబోతోందని, ఈ బాధ్యతలు లభించడానికి మరెంతో కాలం పట్టబోదని వ్యాఖ్యానించారు.

 Supreme Court Judge Makes Key Remarks On India First Woman Chief-ఇండియా తొలి మహిళా చీఫ్ జస్టిస్ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, వివిధ హైకోర్టులకు అడ్ హాక్ జడ్జీలను నియమిస్తూ, మనకు మంచి అభ్యర్థులు వచ్చినప్పుడే టాప్ పోస్టుకు ఓ మహిళ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించగా, ఆపై గంటల వ్యవధిలోనే నారిమన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

#SupremeCourt #Justice Nariman #SupremeCourt #Lady CJ

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు