కెమెరామన్ శ్యామ్ కె నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే.. ?

చిత్రసీమలో జరిగే సిత్రాలు ఎన్నో కానీ అప్పుడప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయి.కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లో గత కొంతకాలం నుండి ప్రముఖ కెమెరామన్ శ్యామ్ కె నాయుడుపై వివాదం నడుస్తున్న సంగతి విదితమే.

 Supreme Court Issues Notices To Cameraman Shyam K Naidu, Supreme Court, Issues Notices, Camera Man, Shyam K Naidu, Sri Sudha Case-TeluguStop.com

ఇది వరకే నటి శ్రీ సుధ హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ కధ రకరకాల మలుపులు తిరిగింది.

అదీగాక విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో, హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇతని పై ఫిర్యాదు చేసిన శ్రీసుధ, ఈ కేసులో శ్యామ్ కె నాయుడుకు లభించిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

 Supreme Court Issues Notices To Cameraman Shyam K Naidu, Supreme Court, Issues Notices, Camera Man, Shyam K Naidu, Sri Sudha Case-కెమెరామన్ శ్యామ్ కె నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా గత కొంతకాలంగా శ్యామ్ కె నాయుడుపై న్యాయపోరాటం చేస్తున్న శ్రీసుధ, గతంలో వేసిన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.

ఈ కేసులో కెమెరామన్ శ్యామ్ కె నాయుడుకు నోటీసులు జారీ చేసింది.నెల రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది.

ఇకపోతే పెళ్లి పేరుతో సహజీవనం చేసి మోసం చేశాడనే సుధ వివాదం ఎన్నడు ముగుస్తుందో తెలియదు.లేదా పలుకుబడి ముసుగులో ఆటక ఎక్కుతుందో తెలియదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube