మార్గదర్శి కేసు విషయంలో సుప్రీం లో పిటీషన్,నోటీసులు అందుకున్న రామోజీ  

Supreme court issues notice to Ramojirao about Margadarsi Chits case, Supreme Court, Ramoji Rao, Margadarsi Chits, Undavali Arun Kumar, RBI, Krishnam Raju, High Court - Telugu High Court, Krishnam Raju, Margadarsi Chits, Ramoji Rao, Rbi, Supreme Court, Undavali Arun Kumar

మార్గదర్శి చిట్స్,మరియు ఫైనాన్స్ కేసు కు సంబంధించి తాజాగా సుప్రీం కోర్టు రామోజీరావుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్దంగా రెండువేల మూడు వందల కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి ద్వారా రామోజీరావు సేకరించారు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ వెలుగులోకి తీసుకువచ్చారు.

TeluguStop.com - Supreme Court Issues Notice To Ramojirao About Margadarsi Chits Case

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దీనితో 2006లో దీనికి సంబంధించి కేసు నమోదు కాగా, 2008లో చార్జీషీట్ దాఖలు చేశారు.కానీ కోర్టుల్లో విచారణ మాత్రం జరగలేదు.

TeluguStop.com - మార్గదర్శి కేసు విషయంలో సుప్రీం లో పిటీషన్,నోటీసులు అందుకున్న రామోజీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కింది కోర్టులో ట్రయల్ జరకుండా హైకోర్టులో రామోజీ స్టే తెచ్చుకోవడం తో చాలా ఏళ్ల పాటు స్టే కారణంగా విచారణ నిలిచిపోయింది.అయితే 2018 లో ఏదైనా కేసుకు సంబంధించి ఆరు నెలలకు మించి స్టే అనేది ఉంచకూడదు అంటూ కొత్త ప్రతిపాదన తీసుకురావడం తో మరోసారి ఈ కేసు విచారణ మొదలైంది.

అయితే అదే ఏడాది హైకోర్టు విభజన కు ఒక్క రోజు ముందు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్కరోజు ముందు రామోజీరావు పై నమోదైన ఈ కేసును హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

అయితే ఈ అంశాన్ని బయటకు తెలియనీయకుండా జాగ్రత్త పడడం తో ఇప్పటివరకు ఈ విషయం వెలుగులోకి రాలేదు.

అయితే తాజాగా ఈ తీర్పు విషయం తెలుసుకున్న ఉండవల్లి మరోసారి దీనికి సంబంధించి సుప్రీం కోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు.

దీనితో విచారణ కు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం రామోజీరావుకు అలానే మార్గదర్శి ఫైనాన్సియర్స్ కు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు, రిజర్వ్ బ్యాంక్ మాజీ ఐజీ కృష్ణంరాజు కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

#High Court #Ramoji Rao #Krishnam Raju #UndavaliArun #Supreme Court

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Supreme Court Issues Notice To Ramojirao About Margadarsi Chits Case Related Telugu News,Photos/Pics,Images..