దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరడంపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది.ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించింది.
రాష్ట్రంలో పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు ఆపడం లేదని పంజాబ్ సర్కార్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కాలుష్య అంశాన్ని రాజకీయం చేయొద్దన్న ధర్మాసనం ప్రజలకు ఆరోగ్యకరమైన గాలిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.
వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని చంపేస్తోందని కోర్టు పేర్కొంది.ఈ క్రమంలోనే పంట వ్యర్థాల తగులబెట్టడం తక్షణమే నిలిపివేయాలని హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.