ఇరాన్‌లో భారతీయ యాత్రికులను ఆదుకోండి: కేంద్రానికి సుప్రీం ఆదేశం

కరోనా కారణంగా దేశం కానీ దేశంలో భారతీయులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు.ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు ఖచ్చితంగా అమలవుతున్న నేపధ్యంలో సొంత దేశానికి వెళ్లాలని భావిస్తున్న భారతీయులు విమానాశ్రయాలకు పోటెత్తారు.

 Iran, Supreme Court, Indians, Corona Effect, Virus-TeluguStop.com

అయితే కరోనా దృష్ట్యా భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది.దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో భారతీయులు చిక్కుకుపోయారు.

తమను ఆదుకోవాల్సిందిగా వారు కేంద్ర ప్రభుత్వానికి, నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలంటూ పిటిషన్‌ దాఖలైంది.

దీనిపై బుధవారం విచారణ జరిపిని సుప్రీంకోర్టు వారిని వెనక్కు తీసుకొచ్చే అంశంపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్‌లో 850 మంది భారతీయులు చిక్కుకున్నారని.

వారిని మాతృదేశానికి తీసుకురావాల్సిందిగా ఓ వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.దీనిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జస్టిస్ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

Telugu Corona Effect, Indians, Iran, Supreme-

ఈ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇరాన్‌లో చిక్కుకున్న వారిలో సుమారు 250 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.వారికి సరైన వైద్య సదుపాయాలు లేవని, అలాగే కోవిడ్ 19 లక్షణాలు లేని వారిని ఇరాన్ అధికారులు హోటళ్లలో ఉండమంటున్నారని ఆయన తెలిపారు.ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా .ఇరాన్ నుంచి చాలా మందిని విడతల వారీగా వెనక్కి తీసుకొచ్చామని వెల్లడించారు.ఇరాన్‌లో‌ భారత రాయబార కార్యాలయం ద్వారా భారతీయులకు సరైన సదుపాయాలను అందిస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇరు పక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం భారతీయుల ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించి వెనక్కి తీసుకోచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాగా కరోనా కారణంగా ఇరాన్‌లో బుధవారం నాటికి 3,036 మంది మరణించగా, 47,593 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube