కోర్టు ధిక్కరణ కేసులో భూషణ్ ను దోషిగా ప్రకటించిన అత్యున్నత న్యాయస్థానం

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది.కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి ప్రశాంత్ భూషణ్ ను దోషిగా తేల్చుతూ సుప్రీం కోర్టు వెల్లడించింది.

 Supreme Court Holds Advocate Prashant Bhushan Guilty Of Contempt For Tweets Agai-TeluguStop.com

ట్విట్టర్ వేదికగా ఇటీవల ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు ప్రధాన న్యాయమూర్తి గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయి అని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయంటూ అభిప్రాయపడింది.ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చుతూ శిక్ష కు సంబందించిన వాదనలు ఈనెల 20 న తిరిగి వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆగ‌స్టు 3వ తేదీన జారీ చేసిన అఫిడ‌విట్‌లో న్యాయవాది ప్ర‌శాంత్ భూష‌ణ్ త‌న వివాదాస్పద ట్వీట్ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ఆ క్ష‌మాప‌ణ‌ల‌ను తిర‌స్క‌రిస్తూ భూషణ్ ను దోషిగా తేల్చింది.

 Supreme Court Holds Advocate Prashant Bhushan Guilty Of Contempt For Tweets Agai-TeluguStop.com

అయితే భూషణ్ చేసిన వ్యాఖ్యలు సుప్రీం వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా లేవ‌ని, కొంద‌రు జ‌డ్జిల వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న‌ను ఉద్దేశిస్తూ ప్ర‌శాంత్ కామెంట్ చేశార‌ని భూషణ్ తరపున న్యాయవాది దుశ్యంత్ దావే న్యాయస్థానానికి తమ వాదనలు వినిపించారు.

న్యాయ‌మూర్తుల‌ను విమ‌ర్శించినంత మాత్రాన యావ‌త్ కోర్టును త‌ప్పుప‌ట్టిన‌ట్లు కాద‌ని ఆయన స్పష్టం చేశారు.అయితే వారి వాదనలతో ఏకీభవించని త్రిసభ్య ధర్మాసనం భూషణ్ ను దోషిగా తేల్చింది.

లాక్‌డౌన్ వేళ సీజే బోబ్డే ఓ సూప‌ర్‌బైక్‌తో ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు.అప్పుడు దానిపై భూష‌ణ్ అనుచిత కామెంట్స్ చేశారు.చీఫ్ జ‌స్టిస్ ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేద‌ని భూష‌ణ్ త‌న ట్వీట్లో ప్ర‌శ్నించారు.

అంతేకాకుండా అంతకముందు సీజేఐ లుగా ఉన్న మరో నలుగురు పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ ఈ కేసును సుమోటో గా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

అయితే బైక్ స్టాండ్‌పై ఉన్న‌ద‌ని, ఆ స‌మ‌యంలో హెల్మెట్ అవ‌స‌రం లేద‌ని, కానీ స్టాండ్‌పై ఉన్న బైక్‌పై సీజే ఉన్న‌ట్లు తాను గుర్తించ‌లేద‌ని, అందుకే క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు ప్ర‌శాంత్ గ‌త అఫిడ‌విట్‌లో తెలిపినప్పటికీ వాటిని తిరస్కరించిన కోర్టు భూషణ్ ను దోషిగా తేల్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube