పెగాసస్ పై దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ..!!

పెగాసస్ వ్యవహారం జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.దేశ భద్రత పేరిట కేంద్ర ప్రభుత్వంనిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాదులు మాదకద్రవ్యాల వంటి విషయాలపై దృష్టి పెట్టకుండా, నిఘా వ్యవస్థ ద్వారా ప్రత్యర్థుల నీ టార్గెట్ చేస్తున్నట్లు ఇటీవల వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభలలో ప్రతిపక్షాలు ఆరోపిస్తు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి.

 Supreme Court Hears Petitions Filed Against Pegasus-TeluguStop.com

ఇటువంటి తరుణంలో పెగాసస్ ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో 9 పిటిషన్లు దాఖలు కావడంతో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ స్టార్ట్ చేయడం జరిగింది.సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్నారు.

పెగాసస్ పై సుప్రీం ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలని అని మొత్తం తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్పైవే ద్వారా.నేతలను జర్నలిస్టులను ప్రత్యర్థులను టార్గెట్ చేసినట్లు పిటిషనర్లు ఆరోపణలు చేయడం జరిగింది.ఈ స్పైవే ఎవరు కొనుగోలు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలిపారు.

 Supreme Court Hears Petitions Filed Against Pegasus-పెగాసస్ పై దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేయాలని కపిల్ సిబల్ కోర్టు ని కోరారు.స్వతంత్ర దర్యాప్తు తో నిజాలు వెలుగులోకి తీసుకు రావాలని కోరారు.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పెగాసస్ పై ఆరోపణలు తీవ్రమైనవి అని అన్నారు.ఈ అంశంపై లోతుగా విచారణ జరగాలని ఖచ్చితమైన సమాచారం జోడించాల్సి ఉంది అని అన్నారు.

#Ramana #Pegasus #Supreme #PetitionsFiled #Central

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు