గణేష్ నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..!!

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి తెలంగాణ హైకోర్టు గతంలోనే కీలక ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. ప్రత్యేక కుంటల్లో నిమజ్జనం చేయాలని.

 Supreme Court Gives Green Signal To Ganesh Immersions-TeluguStop.com

గతంలో హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.పాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకూడదని… కరాఖండిగా గతంలో హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది.

అయితే ఆ సమయంలో పెద్దగా కోర్టు ఆదేశాలను ప్రభుత్వం తో పాటు జిహెచ్ఎంసి పట్టించుకోలేదు.దీంతో ఈ ఏడాది తెలంగాణ హైకోర్టు విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకొని హుస్సేన్ సాగర్ లో ఎట్టిపరిస్థితుల్లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని గతంలోనే ఈ విషయంపై అలసత్వం ప్రదర్శించారని మండిపడింది.

 Supreme Court Gives Green Signal To Ganesh Immersions-గణేష్ నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.అయితే ఈ ఒక్క ఏడాది టైం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం త్వరగా దానికి ససేమిరా అంది తెలంగాణ హైకోర్టు.ఈ తరుణంలో… తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీంకోర్టు కి వెళ్లగా.హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని.వాదనలు విన్నాక ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి అదే రీతిలో గ్రేటర్ హైదరాబాద్ అధికారులకు కొద్దిగా రిలీఫ్ ఇచ్చినట్లయింది.

#Ganesh #Supreme #Tg #Telongana #Hussain Sagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు