క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి ఝలక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

మీరు క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా.అయితే మీకొక చేదు వార్త.

 Supreme Court Gives Credit To Credit Card Holders ,credit Cards, Supreme Court,-TeluguStop.com

 క్రెడిట్ కార్డు ఉయోగిస్తున్న వినియోగదారులకు సుప్రీం కోర్టు షాకిచ్చింది.క్రెడిట్ కార్డు వాడే వారికి లోన్ మారటోరియం వర్తించదు అని తెలిపింది అంటే క్రెడిట్ కార్డు వాడే వారు వడ్డీ మీద వడ్డీ మాఫీ ప్రయోజనం అనేది ఇక మీదట పొందలేరు అని అర్ధం.

సుప్రీం కోర్టు క్రెడిట్ కార్డు వాడే వారికీ లోన్ మారటోరియం అవసరం లేదని అభిప్రాయపడింది.అయితే ఈ వార్త కార్డు వినియోగదారులకు నిజంగా షాకింగ్ వార్తనే చెప్పాలి.

కరోనా కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రజల ఆదాయం భారీగా తగ్గిపోయింది.అంతేకాకుండా చాలామంది ఉపాధి కూడా కోల్పోయారు.ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

అందుకనే లోన్ మారటోరియం ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.అయితే మొదటిలో పర్సనల్ లోన్ మొదలుకుని క్రెడిట్ కార్డుల వరకు ఈ లోన్ మారటోరియం వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.

ఈ నిర్ణయం ప్రకారం బ్యాంకులు కూడా వారి ఖాతాదారులకు ఈ ప్రయోజనాన్నందించాయి.ఇంతవరకూ బాగానే ఉంది.

కానీ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.దానితో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఇప్పుడు లోన్ మారటోరియం అంశంపై సుప్రీం కోర్టులో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.అయితే, వడ్డీ మీద వడ్డీ మాఫీకి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా కూడా ఆర్‌బీఐ మాత్రం దీనికి అంగీకరించడం లేదు.

దీని వల్ల ఆర్థిక వ్యవస్థపై, మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటోంది.అయితే, సుప్రీం కోర్టులో గురువారం కూడా ఈ అంశంపై వాదనలు జరిగాయి.

ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఆ క్రమంలోనే క్రెడిట్ కార్డు వినియోగదారులకు వాడి మీద వడ్డీ (చక్రవడ్డీ) మాఫీ ప్రయోజనం అందించాల్సిన అవసరం లేదని తెలిపింది.

అయితే ఈ వార్త నిజంగానే క్రెడిట్ కార్డు వినియోగదారులకు జీర్ణించుకోలేని వార్త అని చెప్పవచ్చు.‘క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణ గ్రహీతల కిందకు రారు’ అని సుప్రీం కోర్టు పేర్కొంది.

కేవలం బ్యాంకులో లోన్ తీసుకున్న వారిని రుణగ్రహీతలుగా పేర్కొన్నారు.క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణాలను పొందలేదని, కేవలం కొనుగోళ్ళు మాత్రమే చేశారని స్పష్టం చేసింది.

 అందుకే క్రెడిట్ కార్డు వాడే వినియోగదారులు ఇక మీదట బ్యాంకుకు చక్రవడ్డీ వడ్డీ కట్టి తీరాలిసిందే మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube