దర్శకుడు శంకర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన రోబో సినిమా వచ్చి పదేళ్లు పూర్తి కావచ్చింది.సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ నటించిన రోబో సినిమా స్టోరీ వివాదం గత పది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.

 Supreme Court Dismisses Tamil Director Shankars Plea About Robot Story-TeluguStop.com

తమిళ రచయిత ఒకరు ఈ స్టోరీ తనదని తాను గతంలో ఒక మాగజైన్ కోసం రాశాను అంటూ పేర్కొన్నాడు.ఆయన కాపీరైట్‌ వివాదాన్ని పోలీసుల వద్దకు ఆ తర్వాత కేసుని మద్రాస్ హైకోర్టు వరకు తీసుకెళ్ళాడు.

గత కొన్నాళ్లుగా రోబో కాపీరైట్ వివాదం మద్రాస్ హైకోర్టులో కొనసాగుతూనే ఉంది.ఈ కేసును కొట్టివేయాలని అంటూ దర్శకుడు శంకర్ మధ్య సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

 Supreme Court Dismisses Tamil Director Shankars Plea About Robot Story-దర్శకుడు శంకర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుప్రీం కోర్టులో విచారణ తర్వాత తుది తీర్పు వెలువడింది.కాపీరైట్ విషయంలో హైకోర్టు విచారణ కొనసాగాల్సిందేనని.

ఆ కేసుని కొట్టి వేయడం కుదరదు అంటూ సుప్రీం కోర్టు శంకర్ కి తెలియజేసింది.
మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ కు సంబంధించి మీరు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు శంకర్ ని ఆదేశించింది.

దర్శకుడు శంకర్ కూడా సుప్రీం కోర్టులో చుక్కెదురు కావడంతో మళ్లీ ఆయన మద్రాసు హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది.రచయితకు ఆయన వివరణ ఇవ్వాల్సి ఉన్నది.గత కొంత కాలంగా ఈ కథ విషయంలో రాజీ పడేందుకు గాను కోటి రూపాయలు రచయిత డిమాండ్ చేశాడట.ఆ డబ్బును ఇచ్చేందుకు దర్శకుడు శంకర్ నో చెప్పడంతో వివాదం కొనసాగుతూనే ఉంది.

ఆ డబ్బు ఇవ్వడం వల్ల కథ తనది కాదని తనకు తానే ఒప్పుకున్నట్లు అవుతుందని అందుకే ఆ కోటి రూపాయలు ఇవ్వాలని తాను భావించడం లేదని శంకర్ చెబుతున్నాడు.ఈ కేసు ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

ఇప్పటికే రోబో వచ్చి పదేళ్లు పూర్తి కావస్తుంది, మరో పదేళ్లలో ఎవరికైనా క్లారిటీ వచ్చేనా.కాపీరైట్ వివాదం ఆగిపోయిన చూడాలి.

#Robot Story #1Crore #Madras Court #Kollywood #SupremeCourt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు