అయోధ్య రివ్యూ పిటిషన్ పై సుప్రీం సంచలన నిర్ణయం

అయోధ్య రామ మందిరం కేసు దేశంలో ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.దశాబ్దాలుగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఆధిపత్య పోరుకి ప్రతీకగా అయోధ్య కేసు నిలిచింది.

 Supreme Court Dismisses All Ayodhya Review Petitions-TeluguStop.com

అయితే ఈ కేసులో ఫైనల్ గా సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.తీర్పులో భాగంగా అయోధ్య రామ జన్మభూమి స్థలంలో రామ మందిరం కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.

ఇక మసీదు క్రింద ఆలయం ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయని నిర్ధారిస్తూ హిందువులకి అనుకూలంగా తీర్పు వెల్లడించింది.ఇదిలా ఉంటే ఆ తీర్పుపై అసంతృప్తితో ఉన్న ముస్లిం సంఘాలైన సున్ని వక్ష్ బోర్డు ఇతర ముస్లిం సంఘాలు రివ్యూ కోరుతూ సుప్రీంలో పిటీషన్ లు దాఖలు చేసాయి.

మొత్తం అయోధ్య రామ మందిరం తీర్పుని పునఃపరిశీలించాలని మొత్తం 18 పిటీషన్ లు సుప్రీం బెంచ్ ముందుకి వచ్చాయి.ఈ పిటీషన్ ల మీద సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

రివ్యూ కోరుతూ దాఖలైన 18 పిటిషన్లను తిరస్కరించింది.అయోధ్య కేసులో నవంబర్‌ 9న రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఫైనల్ అని స్పష్టం చేసింది.

ఇందులో ఇంకా ఎలాంటి మార్పులకి అవకాశం లేదని తేల్చి చెప్పేసింది.ఆలయ నిర్మాణానికి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు ఉండదని సీజేఐ జస్టిస్‌ బాబ్డే తేల్చి చెప్పారు.

దీంతో ముస్లిం సంఘాలు వేసిన రివ్యూ పిటీషన్ లు ఇప్పుడు తిరస్కరణకి గురైనట్లు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube