పరీక్షలు రాయకుండా పట్టా ఇవ్వడం సబబు కాదన్న సుప్రీం

డిగ్రీ విద్యార్థులు విద్యా సంవత్సరం వృదా కాకుండా వెంటనే పరీక్షలు అయినా పెట్టాలి లేదంటే చివరి సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షను రద్దు చేసి అందరిని పాస్‌ అయినా చేయాలంటూ గత కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.విద్యార్థులు కరోనా కారణంగా పరీక్షలు రాయడం సాధ్యం అవ్వడం లేదు.

 Supreme Court On Degree Examinations, Supreme Court, Degree Exams, Ugc, Last Sem-TeluguStop.com

అయినా కూడా పరీక్షలు పెట్టే వరకు వెయిట్‌ చేయాల్సిందే అంటూ సుప్రీం పేర్కొంది.స్కూల్‌ పిల్లల పరీక్షల మాదిరిగా డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులను పాస్‌ చేయడం ప్రమోట్‌ చేయడం కుదరదు అంటూ మొదటి నుండి కూడా యూజీసీ చెబుతూ వస్తోంది.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేయడంపై యూజీసీ సీరియస్‌ అయ్యింది.అది చెల్లదు అంటూ కూడా పేర్కొంది.

విద్యార్థులు ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయంపై క్లారిటీ వచ్చింది.డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ప్రమోట్‌ చేయకూడదు అని యూజీసీ చెబుతున్న విషయంను పరిగణలోకి తీసుకుంటున్నాం.

విద్యార్థులు పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే పై తరగతులు మరియు డిగ్రీ పూర్తి చేయడం జరుగుతుందని సుప్రీం పేర్కొంది.విద్యార్థులు పరీక్షలు రాయకుండా డిగ్రీ పట్టా పొందడం అనేది సబబు కాదు అన్నట్లుగా సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

దాంతో అన్ని రాష్ట్రాలు కూడా డిగ్రీ పరీక్షలు నిర్వహించాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube